newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆడా మగా ఇష్టప్రకారం కలిస్తే పెళ్లయిపోయినట్లే.. పుతిన్ కొత్త చట్టం

04-03-202004-03-2020 12:41:17 IST
2020-03-04T07:11:17.846Z04-03-2020 2020-03-04T07:10:30.024Z - - 08-08-2020

ఆడా మగా ఇష్టప్రకారం కలిస్తే పెళ్లయిపోయినట్లే.. పుతిన్ కొత్త చట్టం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోవియన్ యూనియన్ కుప్పగూలిన తర్వాత 1993లో పునర్నిర్మించిన రష్యా రాజ్యాంగంలో అతి పెద్ద సవరణలకు పుతిన్ ప్రభుత్వం స్వీకారం చుడుతోంది. వాటిలో మూడు అతి ప్రధానమైన సవరణలకు ఆమోద ముద్ర వేయించుకోవడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 24 పేజీల రాజ్యాంగ సవరణను పార్లమెంటుకు సమర్పించారు. ఆ మూడు కీలకమైన సవరణలు ఏమిటంటే..

1. స్త్రీ, పురుషుల ఇష్ట ప్రకారం శారీరకంగా కలిస్తే.. అధికారికంగా పెళ్లి జరిగినట్లే అనేది. 2. జార్ ప్రభుత్వాన్ని కూల్చాక సోవియట్ యూనియన్ ఉనికిలోకి వచ్చిన వందేళ్ల తర్వాత రష్యా రాజ్యాంగంలో దేవుడిపై విశ్వాసం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా చేర్చనున్నారు. 3. అలాగే స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను చట్టబద్ధం చేసే ప్రసక్తే ఉండదు.

మొత్తం మీద 28 సంవత్సరాల తర్వాత రాజ్యాంగంలో నూతన సవరణల దిశగా రష్యా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా స్త్రీపురుషులు తమ ఇష్టప్రకారం శారీరక సంబంధం పెట్టుకుంటే అధికారికంగా ఆ ఇద్దరికీ పెళ్లి జరిగినట్లే అని రష్యా రాజ్యాంగం గుర్తించనుంది. ఈ మేరకు ర‌ష్యా త‌న రాజ్యాంగంలో కొత్త స‌వ‌ర‌ణ తీసుకురానుంది. ఈ తరహా వివాహాన్ని హెటిరోసెక్సువ‌ల్ యూనియ‌న్‌గా అంటే ఇద్దరు స్త్రీపురుషుల మధ్య కలయికగా గుర్తించిన‌ట్లు ఆ దేశ ప్రతినిధులు చెప్పారు. అలాగే దేవుడు అనే ప‌దాన్ని కూడా కొత్త స‌వ‌ర‌ణ‌ల‌తో రాజ్యాంగంలో చేర్చనున్నారు. రాజ్యాంగ సవరణల నేపథ్యంలో దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ 24 పేజీల స‌వ‌ర‌ణ‌ల‌ను పార్లమెంట్‌కు స‌మ‌ర్పించారు.

మొత్తం  స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చలు జ‌రిపిన త‌ర్వాతే ఈ మార్పుల‌కు శ్రీకారం చుట్టిన‌ట్లు ఆ దేశ పార్లమెంట్‌ స్పీక‌ర్ వ‌చ‌స్లేవ్ వోలోడిన్ తెలిపారు. మరోవైపు  స్వలింగ సంప‌ర్కుల వివాహాల‌ను చ‌ట్టబ‌ద్దం చేసే ప్ర‌స‌క్తే లేద‌ని ఇటీవ‌ల పుతిన్ స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే. నూతన రాజ్యాంగ సవర‌ణల బిల్లుపై మార్చి 10న పార్లమెంట్‌లో చ‌ర్చించ‌నున్నారు. ఏప్రిల్ 22న ఓటింగ్ జ‌రుగనుంది. కాగా సెక్యూలర్‌ దేశమైన రష్యాలో అధికశాతం సాంప్రదాయ క్రిస్టియన్లు ఉన్నారు.

కమ్యూనిస్టు విలువలకు, స్త్రీపురుష సమానత్వానికి పట్టం గట్టిన రష్యా సమాజంలో సాంప్రదాయిక విలువలకు పునాది కల్పిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నూతన సంస్కరణలను చేపట్టనున్నారు. 20 సంవత్సరాలుగా రష్యన్ రాజకీయాల్లో ఆధిపత్యం వహిస్తున్న 67 సంవత్సరాల పుతిన్ పాశ్చాత్య వ్యతిరేక, సాంప్రదాయిక భావాలను ప్రోత్సహించడానికి తొలిసారిగా నడుం కట్టడం విశేషం. వరుసగా నాలుగో సారి క్రెమ్లిన్ సౌధంలో పదవీబాధ్యతలు చేపట్టిన పుతిన్ సాంప్రదాయిక క్లిస్టియన్ దృక్పథాన్ని ప్రోత్సహించే గ్రూపులను చేరదీయటం గమనార్హం. పాశ్చాత్య దేశాలతో రష్యా సంబంధాలు ఘర్షణాత్మకంగా మారుతున్న దిశలో రష్యా అధ్యక్షుడు సాంప్రదాయిక భావాలపైవు మొగ్గు చూపడం చర్చనీయాంశమవుతోంది.

సమాజంలోని వివధ గ్రూపులు, పౌర సమాజంతో విస్తృతంగా చర్చించిన తర్వాతే అధ్యక్షుడు పుతిన్ రాజ్యాంగంలో మౌలిక సంస్కరణలకు దారితీసే సవరణలను చేపడుతున్నారని పుతిన్ ప్రతినిధి చెప్పారు. రష్యాలో మెజారిటీ జనం సంప్రదాయ క్లిస్టియన్లే అయినప్పుటికీ రష్యా అధికారంగా వందేళ్లుగా లౌకిక రాజ్యంగా కొనసాగుతోందన్నది తెలిసిన విషయమే.

అలాగే రష్యా భూభాగంలోంచి ఏ ప్రాంతమయినా విడిపోవడంపై నిషేధం విధిస్తూ మరో సవరణ తీసుకొస్తున్నారు. 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను రష్యా తనలో కలిపేసుకుంది. అలాగే దశాబ్దాలుగా జపాన్‌తో వివాదం రేపుతున్న కురిల్ దీవులను కూడా రష్యా ఆక్రమించుకుంది. పుతిన్ అధికారంనుంచి దిగిపోయిన సమయంలోనే రష్యా ఈ దూకుడు చర్యకు పాల్పడింది.

 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   8 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   10 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   14 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   16 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   18 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   19 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   20 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle