newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

అసలు సిసలు హాట్ సీట్.... గెలుపెవరిదో..?

15-04-201915-04-2019 07:58:54 IST
2019-04-15T02:28:54.329Z15-04-2019 2019-04-15T02:28:50.267Z - - 22-07-2019

అసలు సిసలు హాట్ సీట్.... గెలుపెవరిదో..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండో విడత పార్లమెంట్ ఎన్నికల్లో అందరి ఆసక్తి కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గంపై ఉంది. ఏప్రిల్ 18న మాండ్య లోక్ సభకు ఎన్నిక జరగనుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేత భార్యకు బీజేపీ మద్దతు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీంతో మాండ్యలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ హీట్ పెరిగిపోతుంది.

కన్నడ రెబల్ స్టార్, సీనియర్ కాంగ్రెస్ నేత అంబరీష్ మరణించాక ఆయన భార్య, సినీనటి సుమలత మొదటిసారి ఈ ఎన్నిక ద్వారా  రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆమె మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వాస్తవానికి ఆమె కాంగ్రెస్ నుంచే పోటీ చేయాల్సి ఉన్నా పొత్తులో భాగంగా ఈ సీటును జేడీఎస్ పట్టుబట్టి తీసుకుంది.

మాండ్య నియోజకవర్గంలో జేడీఎస్‌కు మంచి పట్టుంది. దీంతో తన కుమారుడు నిఖిల్ గౌడను రాజకీయ ప్రవేశం చేయించేందుకు మాండ్య సేఫ్ సీట్‌గా ముఖ్యమంత్రి  కుమారస్వామి భావించారు. అయితే, ఇప్పుడు కుమారస్వామి అంచనాలు తప్పాయి. సులువుగా గెలవవచ్చు అనుకున్న సీట్‌‌లో నిఖిల్ గౌడ సుమలత ఎంట్రీతో గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు.

సుమలతకు ఈ సీట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించినా జేడీఎస్ పట్టుబట్టడంతో వదిలేసింది. ఇప్పుడు సుమలత ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. ఆమెకు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు  అధికారికంగా, మరికొందరు అనధికారి‌కంగా మద్దతు ఇస్తున్నారు. ఇక, సుమలతకు మద్దతుగా బీజేపీ ఏకంగా ఇక్కడ అభ్యర్థిని కూడా పెట్టకుండా ఆమెకే మద్దతు ప్రకటించింది.

దీంతో ఆమె ప్రచారంలో సైతం బీజేపీ, కాంగ్రెస్ జెండాలు కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇక, ఆమెకు మద్దతుగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన యాష్, దర్శన్ వంటి హీరోలతో పాటు మరికొందరు నటులు కూడా ప్రచారం చేస్తున్నారు. ఆమెకు నియోజకవర్గంలో సానుభూతి పవనాలు కూడా బాగా వీస్తున్నాయి. తన భర్త అంబరీష్ చేసిన సేవలే తనను గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక, నిఖిల్ గౌడ గెలుపును కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమకు పట్టున్న ప్రాంతం కావడం, కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండటం, ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం నిఖిల్ గౌడకు కొంత మేలు చేస్తుంది. మొత్తానికి, కర్ణాటకలోని కాకుండా దేశ రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా చూస్తున్న మాండ్య సీటులో ఎవరు గెలుస్తారో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle