newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

అవివాహితులు ఒకేగదిలో ఉండొచ్చు.. మద్రాస్ హైకోర్ట్

08-12-201908-12-2019 12:51:32 IST
2019-12-08T07:21:32.186Z08-12-2019 2019-12-08T07:21:22.887Z - - 24-01-2020

అవివాహితులు ఒకేగదిలో ఉండొచ్చు.. మద్రాస్ హైకోర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెళ్ళి కాని ఒక యువతి, యవకుడు ఒకే గదిలో ఉండడం మనం అంగీకరించం. అదే లాడ్జిలోనో,  హోటల్లోనే అయితే సమస్యే లేదు. అయితే ఇలా యువతీయువకులు వివాహం కాకుండా లాడ్జిలో ఉండడం తప్పేం కాదని మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. సహ జీవనం నేరం కానప్పుడు ఒకే లాడ్జిలో అవివాహితులు ఉండటం తప్పుకాదని కోర్టు తీర్పు వెలువరించింది. కోయంబత్తూరు లాడ్జి కేసులో సంచలన తీర్పు చెప్పింది హైకోర్టు.

మనదేశంలో అవివాహితులు ఒకే గదిలో ఉండకూడదనే చట్టం ఏమీ లేదని పేర్కొంది. పెళ్లికాని జంట ఒకే గదిలో ఉండటం నేరంగా పరిగణించలేమంటోంది కోర్టు. 2019 జూన్‌లో కోయంబత్తూరులోని ఓ లాడ్జిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్దంగా లాడ్జిను నడుపుతున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సీల్ చేశారు.

ఈ లాడ్జి గదిలో పెళ్లికాని జంట, మరో గదిలో మద్యం సీసాలను గుర్తించారు. దీంతో ఆ లాడ్జిని అధికారులు సీజ్ చేశారు. అధికారుల చర్యలను సవాల్ చేస్తూ లాజ్జి యాజమాన్యం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై  విచారణ నిర్వహించారు పోలీసులు.

జస్టిస్ ఎంఎస్ రమేశ్ ధర్మాసనం.. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం చెప్పలేదని పేర్కొంది.  పెళ్లికాని స్త్రీ, పురుషులు ఒకే గదిలో ఉండకూడదనే చట్టం లేనప్పుడు ఇది ఎలా తప్పవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇద్దరు వయోజనులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండటాన్ని నేరంగా ఎలా పరిగణించలేమో, అలాగే లాడ్జిలోని ఒకే గదిలో అవివాహిత జంట ఉండటాన్ని నేరంగా చూడలేమని కేసులో తీర్పు చెప్పారు. 

తమిళనాడు మద్యపానచట్టం ప్రకారం ఓ వ్యక్తి వద్ద విదేశీ మద్యం లీటరు, ఏడు లీటర్ల బీరు, 9 లీటర్లు వైన్‌ ఉంచుకోవచ్చు. హోటల్‌కి వెళ్లిన అతిథులే స్వయంగా వాటిని కొనుగోలు చేసి తెచ్చుకుంటే నేరం ఎలా అవుతుందని వ్యాఖ్యానించింది. లాడ్జి మూసివేతలో చట్ట ప్రకారం నిబంధనలు పాటించలేదని, అందువల్ల వెంటనే లాడ్జి తెరిచేలా చూడాలని కోర్టు కోయంబత్తూరు కలెక్టరు ఆదేశాలు జారీచేసింది. ఈ తీర్పు సంచలనంగా మారింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle