newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

05-07-202005-07-2020 17:39:50 IST
2020-07-05T12:09:50.447Z05-07-2020 2020-07-05T12:09:46.594Z - - 05-08-2020

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో భూకంపాలు ఎక్కువయ్యాయి. తాజాగా దేశ సరిహద్దులో ఒక వైపు విదేశీ బలగాల కవ్వింపుతో ఉద్రిక్తత నెలకొంది. రెండురోజుల క్రితమే ప్రధాని మోడీ లడ్డాఖ్ వెళ్ళి వచ్చారు. తాజాగా లద్దాఖ్‌లోని కార్గిల్‌లో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దేశ సరిహద్దుల్లోని కార్గిల్ హిమాలయ పర్వత ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 3.37 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైంది.

 కార్గిల్ కు ఉత్తరాన 433 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.లద్దాఖ్, కార్గిల్ ప్రాంతాల్లో భూమి కంపించిందని సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు చెప్పారు. గురువారం కూడా కార్గిల్ లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. వారంరోజుల్లో కార్గిల్ ప్రాంతంలో రెండుసార్లు భూమి కంపించడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అరుణాచల్ ప్రదేశ్ లోనూ ఆదివారం ఉదయం భూమి కంపించింది. పంజీన్ కు ఉత్తరాన 683 కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు సంభవించాయి. 

అక్కడ  భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. పంజీన్ ప్రాంతంలో 252 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు చెప్పారు. అయితే ఎక్కడా ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈమధ్యే ఢిల్లీ ఎన్సీఆర్. దిల్లీ సహా ఉత్తర భారతదేశమంతటా స్వల్ప భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. తీవ్రత తక్కువే అయినా ఇవి వ్యతిరేక సంకేతాలు ఇస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో భూకంపాల ముప్పు ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle