newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

అయోధ్య హిందువులదే... కండిషన్స్ అప్లై

09-11-201909-11-2019 17:51:33 IST
2019-11-09T12:21:33.304Z09-11-2019 2019-11-09T12:21:18.349Z - - 12-08-2020

అయోధ్య హిందువులదే... కండిషన్స్ అప్లై
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. కొన్ని షరతులతో హిందువులకు అయోధ్య భూమి చెందుతుందని కోర్టు తెలిపింది. అయోధ్యలో దేవాలయం నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చెయ్యాలని, కేంద్ర ప్రభుత్వం ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చెయ్యాలని కోర్టు సూచించింది. వివాదాస్పద భూమిని ట్రస్ట్‌కి అప్పగించాలని. అయోధ్యలో కేంద్రం గానీ రాష్ట్రంగానీ సున్నీ వక్ఫ్ బోర్డుకి సరైన 5 ఎకరాల భూమిని కేటాయించాలని ఆదేశించింది.

దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదానికి జస్టిస్ రంజన్ గొగోయ్ పుల్ స్టాప్ పెట్టారు. ధర్మాసనం తీర్పు విషయంలో ఏకాభిప్రాయానికి రావడం చర్చకు దారితీస్తోంది. అయోధ్యలో వివాదంగా ఉన్న  2.77 ఎకరాల భూమిని రామ్ లాలా న్యాస్ కు కేటాయించాలని సుప్రీంకోర్టు కోరింది. కోర్టు పరిధిలోని ఈ స్థలం రాముడి జన్మ స్థలమని హిందువులు భావిస్తుంటారని అదే సమయంలో మసీదు స్థలం కూడా ఇదేనని ముస్లింలు చెబుతుంటారని కోర్టు పేర్కొంది. 

అయితే. .హిందువుల విశ్వాసాన్ని తోసిపుచ్ఛలేమని  కోర్టు అభిప్రాయపడింది. 1992 డిసెంబర్ ఆరవతేదీన జరిగిన బాబ్రీమసీదు కూల్చివేత ఘటనపై కోర్టు స్పందించింది... ఇది ఖచ్చితంగా చట్ట ఉల్లంఘన అని అభిప్రాయపడింది.  మసీదును నేలమట్టం చేయడం చట్ట ఉల్లంఘనే అని న్యాయమూర్తులు అన్నారు. వివాదాస్పద స్థలం బయటి ప్రదేశం తమకే చెందుతుందని హిందువులు నిరూపించారని సుప్రీంకోర్టు వివరించింది. 

తీర్పు గురించి ఎవరెవరు ఏమన్నారంటే... 

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పలువురు స్పందించారు. ఇది అందరి గెలుపు అన్నారు ప్రధాని మోడీ. అయోధ్య తీర్పులో అంతిమ విజేత భారతదేశమే అన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తీర్పుతో భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిందని హిందూ మహాసభ లాయర్‌ వరుణ్‌ కుమార్‌ సిన్హా అన్నారు. తీర్పుని గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్ బోర్డు అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఈతీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపింది.

అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి తాము అనుకూలమేనని కాంగ్రెస్‌ పార్టీ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్వట్టర్లో పేర్కొన్నారు.

రామ జన్మభూమి విషయంలో గత 150 ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటాన్ని సుప్రీంకోర్టు గుర్తించిందని నిర్మొహి అఖాడా పేర్కొంది. రామమందిర నిర్మాణానికి, నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ట్రస్ట్‌లో నిర్మోహి అఖారాకు తగిన ప్రాతినిధ్యం ఉంటుందని ఆ సంస్థ అధికార ప్రతినిధి అన్నారు.

ఈ తీర్పు చారిత్రాత్మకం, సమతుల్యమయినదని , దేశప్రజలంతా తీర్పుని గౌరవించాలని, స్వాగతించాలని అన్నారు హోంమంత్రి అమిత్ షా ,  కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన  శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. 24న అయోధ్యకు వెళతానన్నారు.

కేంద్రమాజీ మంత్రి ఉమాభారతి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయోధ్య తీర్పుపై స్పందించారు. ఇవాళ తనకు చాలా ఆనందంగా ఉందన్నారు రాజ్ థాకరే. అయితే ఈ తీర్పుపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఐదెకరాల ఆఫర్ ను ఆయన తిరస్కరించారు. తీర్పుపై శ్రీ శ్రీ రవిశంకర్, బాబా రాందేవ్, యూపీ సీఎం యోగి, నితీష్ కుమార్ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle