newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

‘అయోధ్య’ కేసుపై సుప్రీం సీరియస్

11-07-201911-07-2019 13:40:09 IST
2019-07-11T08:10:09.303Z11-07-2019 2019-07-11T08:10:07.734Z - - 19-10-2019

‘అయోధ్య’ కేసుపై సుప్రీం సీరియస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన అయోధ్య భూవివాదం కేసు ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.  అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వంతో ఎలాంటి ప్రయోజనం కన్పించట్లేదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.

అయోధ్య కేసులో ఈ నెల 18లోపు మధ్యవర్తిత్వ కమిటీ అప్పటి వరకు ఉన్న సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆ నివేదికలో మధ్యవర్తిత్వ కమిటీ సామరస్య పరిష్కారం చూపించలేకపోతే జులై 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. 

అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడానికి అవకాశముంటే సూచించాలని ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్‌.ఎం.ఖలీఫుల్లా, ‘‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఈ వ్యవహారంలో మధ్యంతర నివేదికను కమిటీ ఇటీవల న్యాయస్థానానికి సమర్పించింది. అయితే సామరస్య, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు తమకు మరింత సమయం కోరింది ఈ కమిటీ. దీంతో అయోధ్య పరిష్కారం కోసం కమిటీకి ఆగస్టు 15వరకు న్యాయస్థానం గడువు ఇచ్చింది. 

ఇదిలా ఉంటే.. మధ్యవర్తిత్వంతో ఎలాంటి ప్రయోజనం కన్పించట్లేదని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో ఒకరైన గోపాల్‌ సింగ్‌ విశారద్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ పరాశరణ్‌ వాదనలు వినిపించారు. దీనిపై వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం.. మధ్యవర్తిత్వ కమిటీ వారంలోగా అయోధ్యపై వాస్తవ నివేదిక అందించాలని ఆదేశించింది.

ఈ కమిటీ సామరస్య పరిష్కారం చూపించకపోతే జులై 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని వెల్లడించింది. సుప్రీంకోర్టు రోజువారి విచారణతోనైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle