newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

అయోధ్యపై ఓవైసీ కీలక వ్యాఖ్యలు..అలా అయితే అద్వానీపై విచారణ ఎందుకు?

11-11-201911-11-2019 09:50:07 IST
2019-11-11T04:20:07.988Z11-11-2019 2019-11-11T04:19:54.336Z - - 07-08-2020

అయోధ్యపై ఓవైసీ కీలక వ్యాఖ్యలు..అలా అయితే అద్వానీపై విచారణ ఎందుకు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాబ్రీ మసీదు అక్రమ కట్టడమే అయితే ఆ మసీదు కూల్చివేతకు గాను సీనియర్ బీజేపీ నేత ఎల్‌కే అద్వానీపై న్యాయవిచారణ ఎందుకు చేస్తున్నారని అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. పైగా ఒకరి ఇంటిని కూలగొట్టిన వ్యక్తి అదే ఇంటిని తన సొంతం ఎలా చేసుకోగలడని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. 

హైదరాబాద్‌లో మిలాడ్ ఉన్ నబి సందర్బంగా  ఒక బహిరంగ సభలో పాల్గొన్న ఒవైసీ రామజన్మభూమి - బాబ్రీ మస్జీద్ స్థల వివాదం కేసులో  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానమే కావచ్చు కానీ లోపరహితమేమీ కాదన్నారు.

ఎవరైనా మీ ఇంటిని కూలగొట్టినప్పుడు మీరు మధ్యవర్తి దగ్గరకు వెళితే అతడు మీ ఇంటిని కూలగొట్టిన వ్యక్తికే ఆ ఇంటిని స్వాధీనపర్చి మీకు మాత్రం వేరే చోట స్థలం ఇస్తానని చెబితే మీరెలా ఫీలవుతారంటూ ఒవైసీ ప్రశ్నించారు.

మసీదు అక్రమ కట్టడమే అయినట్లయితే బాబ్రీ మసీదును కూల్చివేసిన ఘటనకు కారకుడైన అద్వానీ తదితరులను ఎందుకు విచారిస్తున్నారన్నది తన ప్రాథమిక ప్రశ్న అని ఒవైసీ చెప్పారు.  మసీదు చట్టబద్దమే అయినట్లయితే అద్వానీ, తదితరులు ఆ మసీదు భూమిని ఎలా పొందగలుగుతారు అని ఒవైసీ ప్రశ్నించారు. 

బాబ్రీ మసీదు మన చట్టబద్దమైన హక్కు. మనం భూమి కోసం కొట్లాడటం లేదు. మనం దయాధర్మాన్ని ఏ విషయంలోనూ ఆశించలేదు. మమ్మల్ని బిక్షగాళ్లుగా భావించి వ్యవహరించవద్దు. మేం ఈ దేశానికి చెందిన గౌరవనీయ పౌరులం.

సుప్రీంకోర్టులో సాగిన సుదీర్ఘ విచారణ పొడవునా ముస్లిం పక్షాన నిలిచి వాదించిన న్యాయవాదులకు ఒవైసీ ధన్యవాదాలు తెలిపారు.80 ఏళ్ల వయసులోనూ రాజీవ్ ధావన్ గంటలపాటు మన కోసం వాదించారు. రాజీవ్ ధావన్ సాహెబ్‌కు ధన్యవాదాలు చెప్పడానికి మన వద్ద మాటల్లేవు.  ఈ పరీక్షా సమయంలో ఆయన ఈ కేసు చేపట్టి చివరివరకు పోరాడటమే నిజానికి చాలా గొప్ప విషయం అని ఒవైసీ చెప్పారు. 

బీజేపీ, సంఘ్ పరివార్ దృష్టి ఇంకా అనేక మసీదులపై పడిందని ఈ సందర్భంగా బాబ్రీ మసీదు కేసు కోసం పోరాడటం చాలా ముఖ్యమని ఒవైసీ చెప్పారు. తమవద్ద బాబ్రీ మసీదు తప్ప మరే ఇతర మసీదుల జాబితా లేదని ఈ సంస్థలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే కాశీ, మధుర ప్రాంతాల్లోని మసీదుల కోసం పెట్టిన కేసులను వారు ఎందుకు ఉపసంహరించుకోవడం లేదు అని ఒవైసీ ప్రశ్నించారు.

దేశంలోని లౌకిక పార్టీలన్నీ ముస్లింలను మోసగించారని ఒవైసీ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ స్పందనపై ఒవైసీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలోనే మసీదులో విగ్రహాలను ఉంచారని, మూసిన మసీదు తలుపులు తెరిచిందీ, మసీదును ధ్వంసం చేసిందీ కాంగ్రెస్ పాలనలోనే కాబట్టి తాను కాంగ్రెస్ పార్టీపైనే పోరాడుతూ వచ్చానని ఒవైసీ తెలిపారు.

సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ వంటి లౌకిక వాద రాజకీయ పార్టీలు ఈ సందర్బంగా మౌనం పాటించడాన్ని ఒవైసీ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ముస్లింలు గుండెలు బద్దలు చేసుకోవాల్సిన పని లేదని, ముస్లింలు ఈ దేశ పౌరులని, ఇది వారి సొంత దేశమని ఒవైసీ స్వాంతన పలికారు.

 

 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   an hour ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   3 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle