newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

అమెరికా సంచలనం.. ఒకేసారి 30 వేల మందిపై వ్యాక్సిన్ ప్రయోగం

28-07-202028-07-2020 12:36:11 IST
Updated On 28-07-2020 12:43:58 ISTUpdated On 28-07-20202020-07-28T07:06:11.307Z28-07-2020 2020-07-28T07:06:06.492Z - 2020-07-28T07:13:58.459Z - 28-07-2020

అమెరికా సంచలనం.. ఒకేసారి 30 వేల మందిపై వ్యాక్సిన్ ప్రయోగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచలోనే అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సిన్ అధ్యయనానికి అగ్రరాజ్యం అమెరికా తెరతీసింది. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో అమెరికాలోని బయోటెక్ కంపెనీ మోడర్నా ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఇక ఈ సంస్థ తమ లాస్ట్ స్టేజ్ ట్రయల్స్‌ను సోమవారం ప్రారంభించింది. ఈ ట్రయల్‌లో కొవిడ్-19 వల్ల తలెత్తే శ్వాసకోస సమస్యలు లేని దాదాపు 30 వేల మంది యుక్తవయసున్న వాలంటీర్లు పాల్గొన్నారు. 

కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ కోసం యావత్‌ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను నేడు 30 వేల మంది వాలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఇందుకోసం అవసరమైన డోసులను సిద్ధం చేసినట్లు మోడెర్నా తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ పరీక్షలను మోడెర్నా మార్చిలోనే ప్రారంభించింది. తొలుత 45 మంది వాలంటీర్లపై ప్రయోగించింది. అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం భారీ ఎత్తున నిర్వహించే పరీక్షలతో వ్యాక్సిన్‌ అసలు సామర్థ్యం బయటపడే అవకాశముందంటున్నారు నిపుణులు. 

ఈ నేప‌థ్యంలో అమెరికా ప్ర‌భుత్వం ఈ కంపెనీపై పెట్టుబ‌డిని రెట్టింపు చేసింది. గ‌తంలో 483 మిలియ‌న్ల డాల‌ర్లు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. తాజాగా వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌కు అద‌నంగా 472 మిలియ‌‌న్ల డాల‌ర్లు కేటాయించింది. మోడెర్నా బ‌యోటెక్నాల‌జీ కంపెనీ ఈ విష‌యాన్ని ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 

సుమారు 30వేల రోగుల‌పై మోడెర్నా మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌ర‌గ‌నున్నాయి. వ్యాక్సిన్‌ పరీక్షల కోసం దాదాపు 1,50,000 మంది అమెరికన్లు స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో వేర్వేరు ప్రాంతాల నుంచి సుమారు 30 వేల మందిని ఎన్నుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాక వీరిలో కొందరికి అసలు వాక్సిన్‌, మరి కొందరికి డమ్మీ వెర్షన్‌ ఇవ్వనున్నారు. అనంతరం వీరందరి రోజు వారి దినచర్యలను.. వారి ఆరోగ్యంలో వచ్చే మార్పులను నిశితంగా పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.

కేవలం తామిచ్చిన షాట్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది మాత్రమే కాకుండా ఈ అధ్యయనం ద్వారా వ్యాక్సిన్ ఎంత వరకు సురక్షితం అనేది కూడా పరీక్షిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక మోడర్నా 30 వేల మందితో లాస్ట్ స్టేజ్ ట్రయల్స్‌ను ప్రారంభిస్తోందనే వార్త వైరల్ అవ్వడంతో.. మోడర్నా షేర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సంస్థ షేర్లు 11 శాతం పెరిగి ప్రస్తుతం షేర్ ధర 81.31 డాలర్లకు చేరింది. 

మోడరనా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు ట్రయల్‌ సైట్లలో వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపింది. మొదటిసారిగా జారియాలోని సవన్నాలో వ్యాక్సిన్‌ వేసినట్లు వెల్లడించింది. అంతేకాక ఈ నెల ప్రారంభంలో చైనా, బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకాతో పాటు బ్రెజిల్‌లో తయారవుతున్న వ్యాక్సిన్‌ల చివరి దశ పరీక్షలు కూడా మొదలయ్యాయి.

 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   an hour ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   4 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle