newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

అమెరికా వెన్నులో కరోనా వణుకు... 1600 దాటిన మృతులు

28-03-202028-03-2020 09:11:37 IST
Updated On 28-03-2020 11:07:08 ISTUpdated On 28-03-20202020-03-28T03:41:37.267Z28-03-2020 2020-03-28T03:41:02.384Z - 2020-03-28T05:37:08.283Z - 28-03-2020

అమెరికా వెన్నులో కరోనా వణుకు... 1600 దాటిన మృతులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ దేశాలను అగ్రరాజ్యం వణికించేది. కానీ, ఇప్పుడు కరోనా వైరస్ అమెరికాను ముప్పుతిప్పలు పెడుతోంది.  అమెరికాలో లక్ష దాటాయి కరోనా పాజిటివ్ కేసులు. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 1695 దాటిన కరోనా మరణాలతో అమెరికా వణికిపోతోంది. ఒక్కరోజే 15 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటు, ఇటలీలో 86,498 కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ 9,134 మంది మృతిచెందారు.

చైనా, ఇటలీలను మించిపోయేలా కేసులు నమోదు కావడంతో డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి దారుణంగా మారింది. ఏం చేయాలో తోచడంలేదు. ఆయన వెన్నులో వణుకు పుడుతోంది. ఒక వారంలో కేసుల సంఖ్య పది రెట్లు పెరిగి ఉప్పెనలా ముంచెత్తడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అయితే మరణాల సంఖ్యలో చైనా, ఇటలీ కంటే తక్కువగా ఉండడం కాస్త ఊరటనిస్తోంది.

చైనాలో 3,300 మంది, ఇటలీలో 8,250 మంది మరణించారు. కరోనా కేసుల్లో అమెరికా చైనాని మించి పోవడంతో ఆ దేశం వెల్లడిస్తున్న అధికారిక లెక్కలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవంగా చైనాలో ఎంత మందికి సోకింది? ఎందరు మరణించారు? అన్న వివరాలు తెలీడం లేదన్నారు. తమ దేశంలో టెస్టింగ్‌ కిట్‌లు అన్ని రాష్ట్రాల్లో లభిస్తుండడం వల్ల కేసుల సంఖ్య సరిగ్గా తెలుస్తోందన్నారు. మొత్తం కేసుల్లో 55శాతం పైగా న్యూయార్క్‌లో నమోదు కాగా, 19 రాష్ట్రాల్లో 200 కంటే తక్కువ కేసులు ఉన్నాయన్నారు. న్యూజెర్సీలోనూ కరోనా ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోంది. 

కరోనా కారణంగా న్యూయార్క్‌ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఎక్కువ కేసులు నమోదుకావడంతో వైద్యులు ఆందోళనకు గురవుతున్నారు. దీనివల్ల వృద్ధులు, ఇతర జబ్బులు ఉన్న వారే ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు 50, 40 ఏళ్ల వయసులో ఉన్న వారు మరణిస్తున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశంలో ప్రజలు ఎవరూ రక్షణ చర్యలు చేపట్టడం లేదని, చేతులు శుభ్రంగా కడుక్కోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యక్తిగత పరిశుభ్రతే శ్రీరామరక్ష అని చెప్పినా అంతగా స్పందన రావడం లేదు. అమెరికాలోని కాలిఫోర్నియా, మిషిగాన్‌, ఇల్లినాయిస్‌, ఫ్లోరిడాలోనూ వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే అక్కడ పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. దీనితో సుమారు 33 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇక డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీరి కోసం 2.2 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించారు. కరోనానుంచి ఎలా రక్షణ పొందాలో ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తూనే వున్నారు. 

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle