newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

అమెరికా పని పట్టడానికే వైరస్‌ను వదిలారు.. చైనాపై ట్రంప్ ఆగ్రహం

23-07-202023-07-2020 06:03:18 IST
Updated On 23-07-2020 07:20:28 ISTUpdated On 23-07-20202020-07-23T00:33:18.622Z23-07-2020 2020-07-23T00:33:13.264Z - 2020-07-23T01:50:28.841Z - 23-07-2020

అమెరికా పని పట్టడానికే వైరస్‌ను వదిలారు.. చైనాపై ట్రంప్ ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి, ముఖ్యంగా అమరికా పనిపట్టడానికే చైనా కరోనా వైరస్‌ని ప్రపంచంమీదికి వదలిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా తల్చుకుంటే ప్రపంంచలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేదని.. కానీ అలా చేయలేదని ట్రంప్‌ ఆరోపించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన నాటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చైనాపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.  

మంగళవారం ట్రంప్‌ మ​రోసారి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫట్టా అల్ సిసితో భేటీ సం‍దర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి ముమ్మాటికీ చైనా తప్పిదమేనని వ్యాఖ్యానించారు.. 

ఇది చైనా నుంచి వచ్చింది. వైరస్‌ బయటకు వ్యాపించకుండా వారు ఆపేయవచ్చు. కానీ అలా చేయలేదు. తమ దేశంలో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు. కానీ మిగతా ప్రపంచానికి వ్యాపించకుండా కట్టడి చేయలేకపోయారు. కావాలనే ఇలా చేశారు. యూరోప్‌కు వ్యాపించింది.. తర్వాత అమెరికాలో చొరబడింది. వారు మాకు ఎప్పుడు వ్యతిరేకమే. వారు పారదర్శకంగా లేరు. ఇది మంచి పద్దతి కాదు’ అని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా గురించి ట్రంప్‌ సోమవారం  మాట్లాడారు.

‘ప్రస్తుతం ప్రపంచమంతా కలసికట్టుగా ఉండాల్సిన సమయం. గత రెండు వారాలుగా నేను పలువురు ప్రపంచ అధ్యక్షులతో మాట్లాడుతున్నాను. మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. మంచి స్థితిలో ఉన్నామని ఎవరు భావించకూడదు. ఇది అకస్మాత్తుగా వచ్చి మన మీద పడుతుంది’ అని ట్రంప్‌ హెచ్చరించారు. 

ఈ విపత్కర పరిస్థితుల్లో అమెరికా చాలా దేశాలకు సాయం చేస్తోందని ట్రంప్ తెలిపారు. కొన్ని దేశాలకు వెంటిలేటర్లు లేవు. దాంతో వేలాది వెంటిలేటర్లను వివిధ దేశాలకు పంపుతున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ వైరస్‌ చైనా వల్లే వచ్చిందని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు. అంతేకాక రానున్న వారాలు మరింత భయంకరంగా ఉండబోతున్నాయన్నారు ట్రంప్‌. దేశాలన్ని దారుణమైన పరిస్థితులను చవి చూస్తాయన్నారు. 

కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్‌లు, చికిత్స విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నాము అన్నారు ట్రంప్‌. ఇందుకు గాను గతంలో మంచి విజయాలను సాధించిన కంపెనీలను తాను తీసుకురాబోతున్నట్లు ట్రంప్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ తయారి విషయంలో తాము చాలా బాగా కృషి చేస్తున్నామన్నారు. 

కాగా  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14 మిలియన్ల మంది కరోనా వైరస్‌ బారిన పడితే.. అందులో సుమారు 4 మిలియన్ల మంది అమెరికన్లే ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 6 లక్షలు ఉండగా వీటిలో అత్యధికంగా అమెరికాలో 1,43,000 మరణాలు చోటు చేసుకున్నాయి. 

కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో విఫలమైన కారణంగా అమెరికాలో మళ్లీ రోజుకు 70 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇది పెరిగి పెరిగి రోజుకు లక్ష కేసులు నమోదయ్యే అవకాశాన్ని కొట్టిపడేయలేమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   an hour ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   18 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   19 hours ago


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   a day ago


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

   09-08-2020


భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

   09-08-2020


10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   08-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle