newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

అమెరికా దెబ్బకు హడలెత్తిపోతున్న తాలిబన్లు

25-06-201925-06-2019 14:31:51 IST
Updated On 25-06-2019 15:07:15 ISTUpdated On 25-06-20192019-06-25T09:01:51.989Z25-06-2019 2019-06-25T09:01:49.847Z - 2019-06-25T09:37:15.253Z - 25-06-2019

అమెరికా దెబ్బకు హడలెత్తిపోతున్న తాలిబన్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా నేతృత్వంలోని సంయుక్త సైన్యాల దెబ్బకు విల‌విల‌లాడిన తాలిబ‌న్లు, ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారిపోయి, పాకిస్తాన్ స‌రిహ‌ద్దులో పాగే వేశార‌ట‌. ముఖ్యంగా అఫ్ఘన్, పాకిస్తాన్, ర‌ష్యా భూభాగాన్ని కేంద్రంగా చేసుకుని తాలిబ‌న్లు విధ్వంసానికి పాల్పడుతున్నార‌ట‌. అయితే అమెరికా నేతృత్వంలోని సంయుక్త సైన్యాల‌తో పోరాటం అంత సులువు కాద‌ని తెల్సుకున్న తాలిబ‌న్లు, సంఖ్యా బ‌లం పెంచుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. 

అందుకే భార‌త్ సైన్యం దెబ్బకు ప‌రారవుతున్న ల‌ష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మ‌హ్మద్ ఉగ్రవాదుల‌కు ఆశ్రయం ఇస్తున్నట్లు రీస‌ర్చ్ అండ్ అనాల‌సిస్ వింగ్ అధికారులు, సీఐఏ ఏజెంట్లు చెబుతున్నారు. మొన్నటి దాకా ఉగ్ర‌వాదుల‌కు అన్ని విధాలుగా సాయం అందించిన పాకిస్తాన్ పాల‌కులు, అమెరికా వార్నింగ్, మోడీ దెబ్బతో ఉగ్ర‌వాదుల‌పై క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ట‌.

దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న ల‌ష్కర్, జైష్ ఉగ్రవాదులు తాలిబ‌న్ల ద‌గ్గ‌ర ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు గ్రూపుల‌నే కాదు ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతిన్న ఉగ్రవాద గ్రూపుల‌ను కూడా త‌మ‌లో క‌లుపుకుంటున్నారు తాలిబ‌న్లు. 

ముఖ్యంగా హ‌ఖానీ నెట్ వ‌ర్క్, ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఉబ్జెకిస్థాన్, ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్ త‌దిత‌ర 20 గ్రూపుల‌ను త‌మ‌లో క‌లుపుకుని బ‌లం పుంజుకుంటున్నట్లు రా అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే 65000 మంది ఉన్న తాలిబ‌న్ల బ‌లం ఈ ఉగ్రమూక‌ల చేరిక‌తో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు. అంతేకాదు, ఆత్మాహుతి దాడుల‌ను మ‌రింత పెంచ‌డంతో పాటు, రాత్రి పూట దాడులు చేసేందుకు శిక్ష‌ణ పొందుతున్నార‌ట‌. ఇందుకు కావాల్సిన ఆయుధాలు, బైనాక్యూల‌ర్స్ వంటి ఆధునిక ప‌రిక‌రాలు కొంటున్నార‌ట‌. 

ర‌ష్యా, ట‌ర్కీ దేశాల‌కు చెందిన కొన్ని మాఫియా ముఠాలు తాలిబ‌న్లకు వీట‌న్నింటినీ ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు నిఘా అధికారులు హెచ్చరిస్తున్నారు. నిధుల కోసం గంజాయి పంట పండించ‌డం, డ్రగ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న తాలిబ‌న్లతో ఈ మాఫియా ముఠాలు చేతులు క‌లిపాయ‌నీ, తాలిబ‌న్లు బ‌ల‌ప‌డ‌తే మొద‌ట ఆఫ్ఘ‌నిస్థాన్ పాల‌కుల‌కే చాలా ఇబ్బందని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. ఆ త‌ర్వాత మ‌న‌దేశంలో మ‌ర‌న్న ఉగ్ర దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle