newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అమెరికా కంటే భారత్‌లోనే ఎక్కువ కేసులు .. పరీక్షల్లో తేలుతుంది బండారం.. ట్రంప్‌

07-06-202007-06-2020 08:49:28 IST
2020-06-07T03:19:28.168Z07-06-2020 2020-06-07T03:19:25.185Z - - 27-07-2021

అమెరికా కంటే భారత్‌లోనే ఎక్కువ కేసులు .. పరీక్షల్లో తేలుతుంది బండారం.. ట్రంప్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌, చైనాలో విస్తృతంగా పరీక్షలు జరిపితే.. అమెరికాలో కన్నా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు బయట పడతాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. మెయిన్ న‌గ‌రం‌లో ఓ మెడిక‌ల్ ప్రోడ‌క్ట్స్ కంపెనీని సందర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అధికంగానే ఉంది. జాన్స్ హాప్కిన్స్ నివేదిక ప్రకారం అమెరికాలో దాదాపు 1.9 మిలియన్ కరోనా కేసులు, 1,09,000 మరణాలు సంభవించాయి. మరోవైపు భారతదేశంలో 2,36,657 కరోనా కేసులు, 6,642 మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ మొదట కనుగొనబడిన చైనాలో 84,177 కేసులు, 4,638 మరణాలు నమోదయ్యాయి.

మైన్‌లో కరోనా కిట్స్‌ తయారు చేసే ప్యూరిటన్‌ మెడికల్‌ ప్రొడక్ట్స్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ .. ‘మా దేశంలో 2 కోట్ల మందికి టెస్టులు చేశాం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. టెస్టులు ఎక్కువ చేస్తే.. కేసులు పెరుగుతాయి. నా దేశ ప్రజలకు కూడా ఇదే చెప్పాను. ఒక వేళ మీరు గనక ఇండియా, చైనా వంటి ఇతర దేశాల్లో టెస్టులు విస్తృతంగా చేస్తే.. అక్కడ ఎక్కువ సంఖ్యలో కేసులు బయటపడతాయి అని నేను హామీ ఇస్తున్నాను’ అన్నారు. జర్మనీతో పోలిస్తే.. అమెరికాలోనే అత్యధికంగా టెస్టులు చేసినట్లు ఆయన తెలిపారు. జ‌ర్మ‌నీలో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 40 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ద‌క్షిణ కొరియాలో 30 ల‌క్ష‌ల మందికి ప‌రీక్ష‌లు చేప‌ట్టారని తెలిపారు. అమెరికాలో ఈ సంఖ్య ఎక్కువన్నారు ట్రంప్‌. 

చైనా, భారత్‌ మరిన్ని కరోనా పరీక్షలు నిర్వహించి ఉండి ఉంటే అగ్రరాజ్యాన్ని మించిపోయేలా కేసులు నమోదై ఉండేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అమెరికా రెండు కోట్ల మందికి పరీక్షలు నిర్వహించిందన్నారు. ఎక్కువ మందికి టెస్టులు చేస్తే, ఎక్కువ కేసులు నమోదవుతాయని అందరూ గ్రహించాలని ట్రంప్‌ అన్నారు. చైనా, భారత్, ఇతర దేశాలు ఇంకా ఎక్కువ పరీక్షలు చేసి ఉంటే, మరెన్నో కేసులు నమోదయ్యేవని ట్రంప్‌ అన్నారు.

లాక్ డౌన్ ఎత్తివేశాక అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంత అధికంగా మే నెలలో రెండు లక్షల ఉద్యోగాలను సృష్టించామని ట్రంప్ ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ పుంచుకుంటోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకున్నారు. దేశం పెట్టుకున్న అంచనాలను అవలీలగా అధిగమించేశామని, ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలోకి వచ్చేసినట్లేనని ట్రంప్ ప్రకటించారు.

20 లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు రెడీ

తమ దేశం 20 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసుల్ని సిద్ధం చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. రక్షణ పరమైన పరీక్షలు పూర్తి చేశాక వాటిని సరఫరా చేస్తామని చెప్పారు.  వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ వ్యాక్సిన్‌ విషయంలో అమెరికా అద్భుతమైన పురోగతిని సాధించిందని అన్నారు. కోవిడ్‌ చికిత్సా విధానంలో కూడా అమెరికా మంచి పురోగతి సాధించిందని అన్నారు. ట్రంప్‌ అధికార యంత్రాంగం కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి 5 కంపెనీలను ఎంపిక చేసినట్టుగా న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది.   

అయితే కరోనా వ్యాక్సిన్‌ అంశంలో అమెరికా ప్రభుత్వం చెబుతున్నదానికి, పరిశోధకులు చెబుతున్న మాటలకి పొంతన లేదు. అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి కరోనా వైరస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిందని ట్రంప్‌ అంటుంటే, పరిశోధకులు మానవ శరీరంలోకి వైరస్‌ ప్రవేశించాక వారి రోగ నిరోధక శక్తి వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు.

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   18 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   21 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle