newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

అమెరికా, ఇంగ్లండ్‌కు పాకిన పౌరసత్వ రగడ

20-12-201920-12-2019 09:04:37 IST
Updated On 20-12-2019 10:41:32 ISTUpdated On 20-12-20192019-12-20T03:34:37.531Z20-12-2019 2019-12-20T03:34:28.899Z - 2019-12-20T05:11:32.042Z - 20-12-2019

అమెరికా, ఇంగ్లండ్‌కు పాకిన పౌరసత్వ రగడ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం రగడ దేశవ్యాప్తంగా మంటలు రాజేస్తోంది.  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. బెంగళూరు, మంగళూరులో ఆందోళనకారులు పలుచోట్ల టైర్లు మండిస్తూ నిరసనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు NRC కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల 144 సెక్షన్‌ విధించినప్పటికీ రోడ్లపైకి చేరి నిరసన వ్యక్తం చేశారు. 

లక్నోలో ఒకరు, కర్ణాటకలో నిరసనల్లో ఇద్దరు మృతి చెందారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఆందోళన ల్లో పాల్గొన్న లెఫ్ట్‌ నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా, నీలోత్పల్‌ బసు, బృందా కారత్, స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్, చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా ఆందోళనకారులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఢిల్లీలోని ఎర్రకోట సహా పలు ప్రాంతాల్లో అధికారులు 144 సెక్షన్‌ విధించారు.

ఇదిలా ఉంటే పౌరసత్వ నిరసనల రగడ అమెరికాకు పాకింది. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు మిన్నంటాయి. హార్వర్డ్‌, యేల్‌, స్టాన్‌ ఫర్డ్‌, కొలంబియా వర్సిటీలతో సహా 19 యూనివర్సిటీల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు పౌరస్వత సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనప్రదర్శనలు చేశారు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐయూ), అలీఘడ్‌ యూనివర్సిటీ (ఎఎంయూ)ల్లోకి పోలీసులు చొరబడి విద్యార్థులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండించారు ఆందోళనకారులు.

యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌యూనివర్సిటీలో భారీఎత్తున విద్యార్థులు నిరసనప్రదర్శనలు నిర్వహించారు. ఈ పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని పలువురు విద్యార్ధులు విమర్శించారు.

భారత్‌లో మానవహ క్కుల ఉల్లంఘనకు జరుగుతున్నదనీ, నిరసనకారులకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఈమేరకు ఆన్‌లైన్‌లో బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనపై ప్రముఖ కెర్నెల్‌ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, బర్కిలీ యూనివర్సిటీ, ఇల్లినాయిస్‌ యూనివర్సిటీల విద్యార్థులు సంతకాలు చేశారు. యూనివర్సిటీల్లో మోహరించిన భద్రత బలగాలను ఉపసంహరించుకోవాలనీ, చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పౌరసత్వ సవరణ చట్టం ముస్లిం వలసదారులకు ఉన్న హక్కులను కాలరాస్తోందని ఇండియన్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ మండిపడింది.  ముస్లిములపై విద్వేషం చిమ్మే ట్రంప్‌, నెతన్యాహు, బోరిస్‌ జాన్సన్‌ వంటి వారితో బిజెపి జత కలిసిందని పేర్కొన్నారు. హిందూత్వ భావనలతో దేశాన్ని రెండు జాతులుగా విభజించడానికి బిజెపి చేసే ప్రయత్నాలకు తాము వ్యతిరేకం అన్నారు. మొత్తం మీద దేశంలోనే కాదు విదేశాలలోనూ పౌరసత్వ చట్టసవరణ చిచ్చురేపుతోంది. 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle