newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

01-08-202001-08-2020 09:10:58 IST
Updated On 01-08-2020 09:12:09 ISTUpdated On 01-08-20202020-08-01T03:40:58.572Z01-08-2020 2020-08-01T03:40:51.856Z - 2020-08-01T03:42:09.015Z - 01-08-2020

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధినేత జో బిడెన్‌లా ఉండాలి అనే నినాదం ఇప్పుడు అమెరికా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఊపేస్తోంది. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇండో-అమెరికన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి సంబంధించిన కార్యక్రమం కావడమే. 

అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపే ఇండో-అమెరికన్‌ ఓటర్లను చేరుకునేందుకు 14 భాషల్లో జో బిడెన్‌ ప్రచార కార‍్యక్రమాన్ని పకడ్బందీగా ప్లాన్‌ చేశారు. కీలక రాష్ట్రాల్లో డెమొక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీల గెలుపు అవకాశాలను భారత సంతతికి చెందిన ఓటర్లు నిర్దేశించనున్నారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన ఇండో-అమెరికన్‌ ఓటర్ల కోసం జో బిడెన్‌ ఆకట్టుకునే నినాదాలతో ముందుకొచ్చారు. ‘అమెరికా కా నేత..కైసా హో, జో బిడెన్‌ జైసా హో’ (అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి) అంటూ హిందీ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో నినాదాలతో హోరెత్తించనున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ను ఢీకొంటున్న జో బిడెన్‌ ప్రచార కార్యక్రమం ఇండో-అమెరికన్‌ ఓటర్లను ఆకట్టుకునేలా రూపొందింది. 2016లో ఆబ్‌ కీ ట్రంప్‌ సర్కార్‌ (ఈసారి ట్రంప్‌ ప్రభుత్వం) నినాదం భారతీయుల మనసును తాకిన క్రమంలో డెమొక్రటిక్‌ పార్టీ ప్రచారాన్ని ఏకంగా 14 భారతీయ భాషల్లో చేపట్టేందుకు జో బిడెన్‌ క్యాంపెయిన్‌ వ్యూహకర్తలు సంసిద్ధమయ్యారు. 

ఇండో-అమెరికన్‌ ఓటర్లను వారి మాతృభాషలోనే చేరువయ్యేందుకు ప్రణాళికలు రూపొందించామని బిడెన్‌ క్యాంపెయిన్‌ బృందంలో ఒకరైన అజయ్‌ భుటోరియా తెలిపారు.

తెలుగు, హిందీ, పంజాబీ, తమిళ్‌, బెంగాలీ, ఉర్దూ, కన్నడ, మళయాళీ, ఒరియా, మరాఠీ, నేపాలీ సహా 14 భాషల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు జో బిడెన్‌ ప్రచార బృందంతో అజయ్‌ కసరత్తు సాగిస్తున్నారు. 

భారత్‌లో హోరెత్తే ఎన్నికల ప్రచారాన్ని చూసిన అనుభవంతో జో బిడెన్‌ క్యాంపెయిన్‌లో ఆ సందడి ఉండేలా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. 

అమెరికాలో నివసించే ఇండో-అమెరికన్‌ ఓటర్లలో ఆ ఉత్సుకత కనిపించేలా ‘అమెరికా కా నేత..కైసా హో, జో బిడెన్‌ జైసా హో’ నినాదాన్ని ముందుకుతెచ్చామని తెలిపారు. నవంబర్‌ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌తో డెమొక్రటికక్‌ అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్‌ తలపడనున్నారు.

భారతీయ ప్రాంతీయ భాషల్లో కేంపెయిన్ గ్రాఫిక్స్‌ను రూపొంచాల్సిన అవసరం ఉందని బిడెన్ ప్రచార బృందం భావిస్తోంది. ఆవిధంగా అమరికాలో ఉంటున్న విభిన్న భారతీయ సామాజిక బృందాలు జో బిడెన్‌తో మరింత సన్నిహితమవుతారని సౌతాసియన్స్ ఫర్ బిడెన్ నేషనల్ డైరెక్టర్ నేహా దివాన్ పేర్కన్నారు. 

అమెరికన్ విజయగాథలో వలస ప్రజలకు ప్రధాన పాత్ర ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు బిడెన్ తరచుగా మాతో అంటుంటారు. ప్రతి సంస్కృతినుంచి కష్టపడి పని చేసే ప్రజలను ఆకర్షించడంలోనే అమెరికా సామర్థ్యం ఉంది. ఆ కోణంలో ప్రతి జాతీ అమెరికన్లను శక్తిమంతులను చేసింది అని బిడెన్ అంటుంటారని ఆమె చెప్పారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle