newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

అమెరికాలో సంక్షోభం... రోడ్డున పడనున్న 5 కోట్లమంది ఉద్యోగులు

01-04-202001-04-2020 10:41:51 IST
Updated On 01-04-2020 11:30:21 ISTUpdated On 01-04-20202020-04-01T05:11:51.611Z01-04-2020 2020-04-01T05:11:43.688Z - 2020-04-01T06:00:21.239Z - 01-04-2020

అమెరికాలో సంక్షోభం... రోడ్డున పడనున్న 5 కోట్లమంది ఉద్యోగులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 8,58,669 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 178,099 మంది కోలుకున్నారు. ఇక 6,38,419 మంది చికిత్స పొందుతున్నారు. అటు మొత్తంగా మరణాల సంఖ్య 42,151కి చేరింది. ప్రభుత్వాధినేతలనే కరోనా వదలడం లేదు. 

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్‌ నేతన్యాహూకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ఆయన ప్రటించారు. సోమవారం ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలడంతో బెంజమిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా బెంజమిన్ సహాయకుడికి కరోనా పాజిటివ్ అని తెలిసింది. అయితే బెంజమిన్‌కు సైతం కరోనా సోకి ఉండవచ్చనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో బెంజమిన్ కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. నేతన్యాహూకు మార్చి 15న కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయన కరోనా బారిన పడలేదని ఫలితం వచ్చింది. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని, రాకుమారుడు కరోనా బారిన పడ్డారు. స్పెయిన్ రాకుమారి కరోనాకూ బలైపోయిన సంగతి తెలిసిందే. జర్మనీ ఆర్థికమంత్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఇటు కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రదేశం అమెరికా కుదేలవుతోంది. దాదాపు అన్ని అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. తాజాగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ వెల్లడించిన అంచనాలు భయాందోళనలను కలిగించేలా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో రెండో త్రైమాసికంలో నిరుద్యోగం 32.1 శాతానికి పెరుగుతుందని తెలిపింది. మొత్తం 4.7 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పింది. 1948 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగ స్థాయి ఉండబోతుండటం ఇదే ప్రథమం కావడం గమనార్హం. గతంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం కంటే కరోనా సంక్షోభం తీవ్రంగా ఉండబోతోంది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్యసమితి కూడా నిర్ధారించింది. 

అమెరికాలో మరణాల సంఖ్యను చైనాను దాటిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పలు రాష్ట్రాల్లో షట్ డౌన్ల కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. 33 లక్షల మంది ప్రజలు నిరుద్యోగ లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజా అంచనాల ప్రకారం సేల్స్, ప్రొడక్షన్, ఆహార ఉత్పత్తులు, సేవల విభాగాలలో ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. క్షురకులు, రెస్టారెంట్ సర్వర్లు, ఫ్లైట్ అటెండెంట్లు కూడా భారీగా నిరుద్యోగులుగా మారుతున్నారు. వారందరికీ పూట గడవడమే కష్టంగా మారింది. 

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle