newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

అమెరికాలో భారతీయ విద్యార్ధులకు ఊరట

19-04-202019-04-2020 09:22:16 IST
Updated On 19-04-2020 12:28:50 ISTUpdated On 19-04-20202020-04-19T03:52:16.520Z19-04-2020 2020-04-19T03:52:09.859Z - 2020-04-19T06:58:50.764Z - 19-04-2020

అమెరికాలో భారతీయ విద్యార్ధులకు ఊరట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ప్రభావంతో అమెరికా అల్లకల్లోలంగా మారింది.. ఇప్పటివరకు అమెరికాలో 38 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్టు అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. దక్షిణ కొరియా, సింగపూర్‌ వంటి దేశాల కంటే ఎక్కువగా అమెరికాలోనే పరీక్షలు జరిగాయన్నారు.  కరోనా వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. దీని ప్రభావం అమెరికాలో వున్న భారతీయ విద్యార్ధులపై పడింది.

అమెరికా సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ భారతీయ విద్యార్ధులకి గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సమయంలో అమెరికాలో చిక్కుకున్న వేలాదిమంది విదేశీ విద్యార్ధులకి ఊరట నిచ్చేలా విద్యార్ధులు ఆఫ్ క్యాంపస్ వర్క్ అథరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.ఈ మేరకు విద్యార్ధులకి పలు సూచనలు చేసింది.

ఆన్ క్యాంపస్ ఉద్యోగం కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సమయంలో వైద్య ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ఏం చేయాలో వారికి అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్ధులు ఆఫ్ క్యాంపస్ వర్క్ కోసం అభ్యర్ధన చేసుకోవచ్చని అమెరికా సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది అయితే.విద్యార్ధులు ఈ దరఖాస్తులు చేసుకునే క్రమంలో కొన్ని నిబంధనలర పాటించాలి.  వారు తప్పనిసరిగా వారు చదువుతున్న సంస్థల నుంచి ఆథరైజేషన్ అవసరం అని వివరించింది. ఈ వెసులుబాటు భారతీయ విద్యార్ధులకు గొప్ప ఊరటగా భావిస్తున్నారు. 

ఈ ఆమోదం పొందిన వారు కోర్సు పూర్తయ్యే కాలంలో ఏడాది పాటు ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయవచ్చని తెలిపింది.ఈ నిర్ణయంతో అమెరికాలో చిక్కుకున్న వేలాదిమంది విదేశీ విద్యార్ధులకి ఎంతో మేలు కలుగుతుందని అంటున్నారు నిపుణులు. కరోనా నుంచి త్వరగా బయటపడడానికి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు భారతీయ విద్యార్ధులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు  అమెరికాలో మృత్యుఘోష ఆగడంలేదు. మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలు దాటితే కరోనా మరణాలు 38 వేలు దాటిపోయాయి. మరే దేశంలోనూ కరోనా ఈ స్థాయిలో విధ్వంసం జరగడం లేదు.

నాలుగైదు రోజుల నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లోనే ఏకంగా 3,856 మరణించారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరం చేయాలని, కార్యాలయాలు తెరవాలని అధ్యక్షుడు ట్రంప్ కోరుతున్నారు.  కోవిడ్‌ను అరికట్టడానికి అమెరికా అదనపు చర్యలు చేపట్టకపోతే లక్షలాది మంది దారిద్య్రరేఖకి దిగువకి వెళ్లిపోతారని ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల నిపుణులు ఫిలిప్‌ అల్సటాన్‌ హెచ్చరించారు. ప్రపంచం మాంద్యంలోకి జారుకుంటుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle