newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

అమెరికాలో న్యాయం మొదలైంది.. మినియాపోలీస్ విభాగం మొత్తంగా రద్దు!

09-06-202009-06-2020 08:34:39 IST
Updated On 09-06-2020 09:25:41 ISTUpdated On 09-06-20202020-06-09T03:04:39.980Z09-06-2020 2020-06-09T03:04:38.223Z - 2020-06-09T03:55:41.513Z - 09-06-2020

అమెరికాలో న్యాయం మొదలైంది.. మినియాపోలీస్ విభాగం మొత్తంగా రద్దు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోలీసు అధికారిచే నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ దారుణ హత్య ఘటనకు వ్యతిరేకంగా యావత్ అమెరికా ప్రజలు ఒక్కతాటిపై నిలిచి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా గత పదిరోజులకు పైగా సాగిస్తున్న తీవ్రమైన నిరసనలు ఎట్టకేలకు న్యాయసాధనవైపు అడుగు ముందుకేసాయి. ఫ్లాయిడ్‌తో పోలీసు అధికారి వ్యవహరించిన తీరును నిరసిస్తూ మినియాపోలిస్‌ సిటీకౌన్సిల్‌ సభ్యులు పోలీస్‌ విభాగం మొత్తాన్ని రద్దు చేయాలని తీర్మానించారు.

ఇటీవలే సిటీ పార్క్‌ వద్ద జరిగిన భారీ ర్యాలీలో పాలక మండలిలోని 12 మంది సభ్యుల్లో 9 మంది పాల్గొన్నారు. పాలక మండలి అధ్యక్షురాలు నగర పోలీసు వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. పోలీసు వ్యవస్థను సంస్కరిద్దామనుకున్నామని, అది సాధ్యం కాలేదని, అందుకే, రద్దు చేసి, నగర పౌరులకు నచ్చిన విధంగా కొత్త పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

ప్రస్తుతం కొనసాగుతున్న మినియా పోలీస్ స్థానంలో సరికొత్త పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ప్రజలను సురక్షితంగా ఉంచేలా పనిచేసే కొత్త మోడల్‌ను ప్రవేశపెడతామని సిటీ కౌన్సిల్‌ అధ్యక్షుడు లిసా బెండర్‌ తెలిపారు. ప్రస్తుత వ్యవస్థ సమాజానికి ఏమాత్రం రక్షణ కల్పించడం లేదన్నారు. పోలీస్‌ విభాగం రద్దుకు సిటీ కౌన్సిల్‌ సభ్యులు అత్యధికం మద్దతిస్తున్నారని కౌన్సిలర్‌ అలోండ్రా కానో తెలిపారు. గత నెల 25న మినియాపోలిస్‌ పోలీస్‌ అధికారి డెరెక్‌ చావెన్‌ దాష్టీకం కారణంగా ఫ్లాయిడ్‌ మరణించిన విషయం తెలిసిందే

2000 సంవత్సరంలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని క్యాంప్టన్‌, 2012లో న్యూజెర్సీ రాష్ట్రంలోని క్యాండెన్‌లో ఈ విధంగా మొత్తం పోలీసు వ్యవస్థను రద్దు చేసి, కొత్త పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆఫ్రో అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణించిన నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలిప్పుడు శాంతియుత ప్రదర్శనలుగా మారిపోయాయి. పోలీసు సంస్కరణలే ప్రధాన డిమాండ్‌గా ఈ ప్రదర్శనలు జరుగుతూండటంతో పోలీసులు కూడా దుడుకు చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. 

నేడు జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు

వర్ణవివక్షకు బలైనపోయిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది. హ్యూస్టన్‌లో తల్లి సమాధి పక్కనే ఫ్లాయిడ్‌ మృతదేహాన్ని మంగళవారం ఖననం చేయనున్నట్లు కుటుంబం తరఫు మీడియా ప్రతినిధి ఒకరు ప్రకటించారు. హిల్‌క్రాఫ్ట్‌ అవెన్యూలోని ‘ద ఫౌంటేన్‌ ఆఫ్‌ ప్రెయిస్‌’చర్చిలో ఫ్లాయిడ్‌ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారని, ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిసింది. అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ల తరఫున పోటీ చేస్తున్న జో బైడెన్‌ ఫ్లాయిడ్‌ కుటుంబాన్ని కలుస్తారని ఆయన సహాయకుడొకరు తెలిపారు. ఫ్లాయిడ్‌ మరణానికి కారణమైన  అధికారి డెరెక్‌ ఛావెన్‌ సోమవారం కోర్టు ముందు హాజరు కానున్నాడు.

ట్రంప్‌కు ఓటమి ఖాయమేనా?

ఐదు నెలల్లో ఎన్నికలను ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రజాభిమానంలో బాగా వెనుకబడ్డారని తాజా సర్వేలు చెబుతున్నాయి. అమెరికా ప్రజల్లో 80 శాతం మంది దేశం తప్పుదారిలో నడుస్తోందని, పరిస్థితులు అదుపు తప్పాయని అభిప్రాయపడ్డారు. డెమోక్రాట్ల అభ్యర్థి బిడెన్‌ దూకుడుగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో ట్రంప్‌కు తెల్లజాతి ప్రజలు భారీగా మద్దతిచ్చారు. వారిలో ఎక్కువ మంది ఈసారి బిడెన్‌కు మద్దతిస్తున్నారు. కొత్త యుద్ధాలు ప్రారంభించకపోవడం, విదేశాల్లోని అమెరికన్‌ సైనికులను వెనక్కి రప్పించడం మధ్య తరగతి ప్రజల్లో ట్రంప్‌ పట్ల సదభిప్రాయాన్ని పెంచినప్పటికీ జాతి వివక్ష పట్ల తెలుపు, నలుపు విభేదం లేకుండా యావత్ అమరికా ఒక్కటవటంతో జార్జి హత్యపై దారుణ వ్యాఖ్యలు చేసిన దేశాధ్యక్షుడు ట్రంప్ నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో మరోసారి గెలిచే అవకాశాలు బాగా సన్నగిల్లాయని మీడియా రిపోర్టులు.

 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   8 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   10 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   14 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   16 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   19 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   19 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   20 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle