newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

అమెరికాలో కరోనా కల్లోలం.. ఒకేరోజు 4,590 మంది మృతి.. నిమిషానికి ముగ్గురి బలి

18-04-202018-04-2020 08:33:13 IST
Updated On 18-04-2020 09:27:29 ISTUpdated On 18-04-20202020-04-18T03:03:13.845Z18-04-2020 2020-04-18T03:03:11.060Z - 2020-04-18T03:57:29.560Z - 18-04-2020

అమెరికాలో కరోనా కల్లోలం.. ఒకేరోజు 4,590 మంది మృతి.. నిమిషానికి ముగ్గురి బలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికన్ల గుండె చెరువవుతోంది. అమెరికా ఆరోగ్య సంరక్షణ చేష్టలుడిగి దిక్కులు చూస్తోంది. చరిత్రలో కనీవినీ ఎరుగని ఉత్పాతం కరోనా రూపంలో విరుచుకుపడినప్పడు ఏం చేయాలో తోచక అంతటి అగ్రరాజ్యం కూడా చేష్టలుడిగి నిస్సహాయంగా నిలబడిపోయింది. కరోనా మహమ్మారి తీవ్రతకు అక్కడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా మరణాలు, రోగుల సంఖ్య లెక్కలు చూస్తే.. లెక్కలే వణికిపోతున్న దుస్థితి..

శుక్రవారం ఒక్క రోజే 24 గంటల్లో 4,590మందికి పైగా అమెరికాలో కరోనా బారినపడి పిట్టల్లా రాలిపోయారు. నిమిషానికి ముగ్గురు బలయ్యారు. మొత్తం మరణాలు 35,578 వేలు దాటేశాయి. అయితే కరోనా అనుమానిత మరణాలను కూడా కలిపి లెక్కించడంతోనే ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని భావిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య 7 లక్షలకు పెరిగింది. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు లక్షన్నర దాటిపోయాయి. రష్యాలో ఒకేరోజు 4,070 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో ఒకేరోజు మరో 847 మంది చనిపోయారు. 

గురువారం నాటి మరణాలతో సమీప భవిష్యత్తులో అమెరికా కోలుకుంటుందా అని యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఇది నిజంగానే చరిత్ర ఎరుగని మహా దారుణం. ఇదే రేటుతో మరణాలు నమోదైతే ఒక్క ఏడాదిలో 3 లక్షల నుంచి 33 లక్షల మంది చనిపోయే అవకాశముందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించడం వణికిస్తోంది. భౌతిక దూరం కఠినంగా అమలు చేసినప్పటికీ 12 కోట్ల మందికిపైగా వైరస్‌ సోకుతుందని ఐరాస చావుకబురు చల్లగా చెప్పింది.

అమెరికాలో కోవిడ్‌ సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 4,591 మంది 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్క రోజు 2,569 మంది మరణిస్తే, గురువారం రాత్రి 9 గంటలయ్యే సరికి దాదాపుగా అంతకు రెట్టింపు సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. మొత్తంగా మృతుల సంఖ్య 33 వేలు దాటేసింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌లో కోవిడ్‌ విశ్వరూపం చూపిస్తోంది.

ఇప్పటి వరకూ అమెరికాలో మొత్తం మృతుల సంఖ్య 35,578కి చేరిందని, ఇన్ని మరణాలు మరే దేశంలోనూ లేవని జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం ప్రకటించింది. దేశంలో మొత్తం 6,86,431 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని పేర్కొంది. ఒక్క న్యూయార్క్‌లోనే 2,26,000 పాజిటివ్‌ కేసులు ఉండగా, 16,106మంది మరణించారు. న్యూజెర్సీలో 75,317మందికి వైరస్‌ నిర్ధారణ కాగా 3,518మంది మృతిచెందారు. కాగా అమెరికాలో నమోదైన కేసుల్లో 30శాతం మంది ఆఫ్రికన్‌ అమెరికన్లకే సోకింది. 

కరోనా కట్టడి కాకపోతే అమెరికాలో లక్ష నుంచి 2 లక్షల 40 వేల మంది వరకు చనిపోతారని అంచనాలున్నాయి. అయితే గత ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా 850 కౌంటీలలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ నిపుణులు వెల్లడించారు. ఇప్పటికే వైరస్‌ సోకినవారికి చికిత్స అందించడానికి వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. యాంటీవైరల్‌ థెరపీలు, ఇమ్యూన్‌ థెరపీ, బ్లడ్‌ ప్లాస్మా థెరపీ వంటివి సత్ఫలితాల్నే ఇస్తున్నాయి.  

3 లక్షల నుంచి 33 లక్షల వరకు మరణాలు తప్పదు

మరోవైపున కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసినప్పటికీ ఈ ఏడాదే దేశంలో 3 లక్షల మరణాలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితి ఆర్థిక కమిషన్‌ ఆఫ్రికా విభాగం అంచనా వేసింది. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మృతుల సంఖ్య 33 లక్షల వరకు కూడా ఉంటుందని హెచ్చరించింది. భౌతిక దూరం కఠినంగా అమలు చేసినప్పటికీ 12 కోట్ల మందికిపైగా వైరస్‌ సోకుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆఫ్రికాలో కరోనా కేసులు 20 వేలకు చేరుకున్నాయి.  

బ్రిటన్‌లో కోవిడ్‌ మృతులు 14 వేలకు చేరువలో ఉండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ని మరో 3 వారాలు పొడిగించింది. అయితే, కరోనా కట్టడిలో వ్యవస్థాగతమైన లోపాల కారణంగా యూకేలో 40 వేల వరకు మరణాలుండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయాలని లండన్‌ మేయర్‌ ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు కోవిడ్‌ భయాందోళనలతో అన్ని దేశాలు సరిహద్దుల్ని మూసివేయడంతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఈ రంగంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని ప్రపంచ పర్యాటక సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 96 శాతం పర్యాటక ప్రాంతాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.  

యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అంచనాల ప్రకారం ఏప్రిల్‌ 14నాటికి దేశంలో కరోనా బారిన పడినవారిలో 4శాతం మంది ఆసియా సంతతివారు . 30శాతం మంది ఆఫ్రికన్‌ అమెరికన్లు.  న్యూయార్క్‌లో ఖాళీగా ఉన్న 11వేల హోటల్‌ గదులను క్వారంటైన్‌ కోసం ఉపయోగించకోనున్నట్లు నగర మేయర్‌ బిల్‌ డి బ్లాసియో తెలిపారు. కాగా ఆర్థిక, జననష్టాలకు చైనా నుంచి పరిహారం పొందడానికి అమెరికా ఫెడరల్‌ కోర్టులో కేసు వేయడానికి అనుమతించే చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఇద్దరు చట్టసభ సభ్యులు ప్రకటించారు. ఈ విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ తీరుతో ఆయనపై తమకు విశ్వాసం పోయిందన్నారు. 

ట్రంప్ కామెడీకి అంతేలేదు.. మరణాల్ని తగ్గించారట..

అమరికాలో మరణాల రేటును తన కృషితోటే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. మొదట్లో 15-22 లక్షల మంది మరణిస్తారని అంచనా వేసినా, తన చర్యలతో సంఖ్య 1- 2.4 లక్షలకు తగ్గిపోయిందని వివరించారు. ‘ప్రజలు సాధారణ జీవితాన్ని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఆంక్షల సడలింపుపై నిర్ణయం అధికారాన్ని ట్రంప్‌ గవర్నర్లకే అప్పగించారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో భాగంగా.. షట్‌డౌన్‌ను మూడు దశల్లో ఎత్తివేసేందుకు అమెరికా మార్గదర్శకాలను రూపొందించింది. 

కాగా ప్రపంచవ్యాప్తంగా 21 లక్షల మందికిపైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. లక్షా 50 వేలకు పైగా జనం మరణించారు. 

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   4 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle