newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

అమెరికాలో ఒక్క రోజులో 2,763 మంది మృతి.. మత్తువదలని ట్రంప్

17-04-202017-04-2020 08:25:50 IST
2020-04-17T02:55:50.886Z17-04-2020 2020-04-17T02:55:48.798Z - - 14-06-2021

అమెరికాలో ఒక్క రోజులో 2,763 మంది మృతి.. మత్తువదలని ట్రంప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనన్ని కరోనా మరణాలు అమెరికాలోనే నమోదవుతున్నాయి. గత నాలుగైదురోజులుగా తన రికార్డును తానే బద్దలు గొడుతున్న అమెరికా గురువారం మరో ఘనత సాధించింది. 24 గంటల్లో దాదాపు 2,800మంది అమెరికన్లు కరోనా బారిన పడి మరణించగా ఇంతవరకు దేశవ్యాప్తంగా 34,000మంది కరోనాకు బలయ్యారు. ఒక్క న్యూయార్క్ మహానగరంలోనే ఇంతవరకు 16,251 మంది మరణించడం ప్రపంచాన్ని దిగ్బ్రాంతిపరుస్తోంది. కాగా అమెరికాలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం సాయంత్రానికి 6,54,343 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా వరకు మరణ మృదంగం అనే మాట చిన్నబోయినట్లే చెప్పాలి. యూరప్‌లో కరోనా కేసులు 10 లక్షల 50 వేలు దాటిపోయాయి. మృతుల సంఖ్య 90 వేలు దాటేసింది.

గురువారం సాయంత్రానికి అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్‌–19 మరణాలు 33 వేల మార్కును దాటేసింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారితో 33,490 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఇందులో బుధవారం ఒక్క రోజే 6,185 మంది చనిపోగా, గురువారం మరో 2,763 మంది మృతి చెందారు. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు 16,251 మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశం మొత్తమ్మీద కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య గురువారానికి 6,54,343కు చేరుకుంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 24 గంటల్లో ఇంత మంది చనిపోవడం రికార్డు అని జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం ప్రకటించింది. 

ఒకవైపు రికార్డు మరణాలతో అమెరికా అల్లాడుతున్నా, కోవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పట్టిందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గినందున అమెరికన్లంతా తిరిగి పనుల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ నెలలోనే తిరిగి మార్కెట్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడిన అనంతరం కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కాగా.. కొవిడ్‌-19 వైరస్‌ ఆవిర్భావానికి సంబంధించి నిజానిజాలు వెల్లడించాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చైనాను కోరారు. ఆయన చైనా విదేశాంగ డైరెక్టర్‌ యాంగ్‌ జీచీకి ఫోన్‌ చేశారు. 

ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఎప్పుడు ప్రారంభించాలో అధ్యక్షుడే నిర్ణయిస్తాడంటూ రాష్ట్రాల గవర్నర్లతో విభేదించిన ట్రంప్‌ ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఈ విషయంలో అధ్యక్షుడి కంటే గవర్నర్లకే అధికారాలు ఎక్కువగా ఉన్నాయని అంగీకరించారు. మే 1వ తేదీ నుంచి అమెరికాలో మార్కెట్లు తిరిగి తెరవాలని తొలుత భావించారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో కేసులు, మృతుల సంఖ్య భారీగా తగ్గడం వల్ల, అంతకంటే ముందే ఆయా రాష్ట్రాలు పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తామని చెబుతున్న ట్రంప్‌ కొన్ని రాష్ట్రాల్లో వాణిజ్య కార్యకలాపాలు మొదలైతే అమెరికా ఆర్థిక రంగాన్ని నిలబెట్టవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. 

పైగా కోవిడ్‌ మరణాల సంఖ్యను కొన్ని దేశాలు దాచి పెట్టడం వల్లే అమెరికా కరోనా మరణాల జాబితాలో ముందుందని ట్రంప్ వక్రంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే చైనాను ఆడిపోసుకుంటున్న ట్రంప్ ఇప్పుడు  ప్రపంచ దేశాలు కూడా కరోనా మరణాలను దాచిపెడుతున్నాయంటూ తన కంపును మరింతగా విస్తృతపర్చుకున్నారు.

మరోవైపున యూరప్‌లో కరోనా కేసులు 10 లక్షల 50 వేలు దాటిపోయాయి. మృతుల సంఖ్య 90 వేలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 65 శాతానికి పైగా యూరప్‌లో సంభవించాయి. ఈ పరిణామంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్నాళ్లూ వైరస్‌ వణికించిన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉంటే మరికొన్ని కొత్త దేశాలకు వైరస్‌ పాకిందని డబ్ల్యూహెచ్‌వో యూరప్‌ రీజనల్‌ డైరెక్టర్‌ హన్స్‌ క్లుగె అన్నారు. బ్రిటన్, టర్కీ, ఉక్రెయిన్, బెలారస్, రష్యాలలో వైరస్‌ తీవ్రరూపం దాలుస్తోందన్నారు. యూరప్‌కి ముప్పు ఇంకా తొలగిపోలేదని అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.  

న్యూయార్క్‌ ప్రజలు శుక్రవారం నుంచి బయటకు వస్తే మాస్కులు ధరించడం తప్పనిసరని గవర్నర్‌ ఆండ్రూ కువోమో వెల్లడించారు. బుధవారం వరకు 2,13,770 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్‌ నగరంలోనే 1,11,424 కేసులు నమోదు కాగా.. 6,840 మంది చనిపోయారు. కరోనా వైరస్ చాలదన్నట్లు అమెరికాలో కొత్త వైరస్‌ పుట్టుకొచ్చింది. వాషింగ్టన్‌కు సమీపంలోని ఓ సైనిక స్థావరంలో మెడికల్‌ నిఘా విభాగం వీరప దీనిని గుర్తించారు. నిఘా, సైన్స్‌, వైద్య నిపుణులతో కూడిన ఈ విభాగం.. దేశవిదేశాల్లో అమెరికా సైన్యానికి ఏర్పడే ముప్పులను ఎప్పటికప్పుడు కనిపెడుతుంటుంది. కరోనా వైరస్‌ అమెరికాలో విజృంభిస్తుందని ముందుగానే చెప్పింది. 

అయితే అమెరికాలో కరోనా కేసుల ఉధృతి బాగా తగ్గిందని దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించడంపై త్వరలో నూతన మార్గదర్శకాలు విడుదల చేస్తామని బుధవారం వెల్లడించారు. వీటిని గురువారం అంటే భారత కాలమానం ప్రకారం శుక్రవారం ప్రకటిస్తామన్నారు. దేశంలో ఈ స్థాయిలో మరణాలు, వినాశనం ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలో మరెక్కడా లేని అధునాతన టెస్టింగ్‌ సిస్టమ్‌ను అతివేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 

కరోనా నిర్ధారణకు ఇంతవరకు 48 రకాల వేర్వేరు పరీక్షలను అధీకృతం చేశామని, లేబొరేటరీలను విస్తరించేందుకు 300 కంపెనీలతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. ‘ది అబోట్‌ లాబ్స్‌’ సంస్థ అభివృద్ధి చేసిన యాంటీబాడీ టెస్ట్‌ అత్యుత్తమమైన పరీక్షని, కొద్ది వారాల్లోనే రెండు కోట్ల మందికి ఈ పరీక్షలు నిర్వహించడానికి అందుబాటులోకి తెస్తామని తెలిపిందని చెప్పారు. థెరపీలు, చికిత్సలను వేగంగా అధ్యయనం చేయడానికి శాయశక్తులా కృషిచేస్తున్నామని.. 35 క్లినికల్‌ పరీక్షలు నిర్వహించామని ట్రంప్‌ చెప్పారు. వ్యాక్సిన్ల పరీక్షకు బాగా సమయం తీసుకుంటుందన్నారు.

కాగా, కోవిడ్‌ నివారణకు టీకా అభివృద్ధి చేస్తేనే ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశముందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్‌ స్పష్టం చేశారు. ‘టీకా ఒక్కటే ప్రపంచంలో  సాధారణ పరిస్థితులున్న భావనను తీసుకురాగలదు. దీంతో కోటానుకోట్ల డాలర్ల మొత్తం ఆదా అవడమే కాకుండా విలువైన ప్రాణాలు మిగుల్చుకోవచ్చు’’అని ఆయన ఆఫ్రికాదేశాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు లక్షల కోట్ల డాలర్ల విరాళాలు సేకరించాలని తాను మార్చి 25న పిలుపునివ్వగా ఇప్పటివరకూ ఇందులో 20 శాతం మొత్తం అందిందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులను తట్టుకునేందుకు ఆఫ్రికన్‌ దేశాలు, ప్రభుత్వాలు చేస్తున్న కృషిని కొనియాడారు.  

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   4 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   19 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle