newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

అమెరికాలో ఆగని మరణ మృదంగం.. ఒకేరోజు 3,856 మంది మృతి

19-04-202019-04-2020 08:58:21 IST
Updated On 19-04-2020 10:01:54 ISTUpdated On 19-04-20202020-04-19T03:28:21.277Z19-04-2020 2020-04-19T03:28:19.207Z - 2020-04-19T04:31:54.762Z - 19-04-2020

అమెరికాలో ఆగని మరణ మృదంగం.. ఒకేరోజు 3,856 మంది మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అగ్రరాజ్యం అమెరికాలో మృత్యుఘోష కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలు దాటితే కరోనా మరణాలు 38 వేలు దాటిపోయాయి. మరే దేశంలోనూ కరోనా ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించలేదు. నాలుగైదు రోజుల నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. 24 గంటల్లోనే ఏకంగా 3,856 మరణాలు నమోదయ్యాయి. ఉత్తర న్యూజెర్సీలో కోవిడ్‌ కల్లోలం రేపుతోంది. రోజురోజుకీ ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. నర్సింగ్‌హోమ్‌లో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. జనం కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

కాగా కోవిడ్‌ కేసులు ఈ స్థాయిలో నమోదు కావడానికి ఎక్కువ మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడమే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఇప్పటివరకు 38 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దక్షిణ కొరియా, సింగపూర్‌ వంటి దేశాల కంటే ఎక్కువగా అమెరికాలోనే పరీక్షలు జరిగాయన్నారు. 

‘‘దేశం చాలా భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. 184 దేశాల్లోనూ అదే దుస్థితి. ఏ నేరం చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాం. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదు’’అని ట్రంప్‌ అన్నారు. సొరంగమార్గంలో వెళుతూ ఉంటే చిమ్మ చీకటి నెలకొంటుంది. ఇప్పుడు ఆ చీకట్లో కాంతి రేఖ కనిపిస్తోంది’’అన్న ట్రంప్‌ త్వరలోనే ఈ మహమ్మారి నుంచి బయటపడతామంటూ భరోసా నింపే ప్రయత్నం చేశారు.  

అమెరికాలో ఒకవైపు కోవిడ్‌ విజృంభణ కొనసాగుతూ ఉంటే మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మార్కెట్లు తెరిచే విషయంలో పట్టుదలగా ఉన్నారు. డెమోక్రాట్లు గవర్నర్లుగా ఉన్న రాష్ట్రాలు వీలైనంత త్వరగా ఆర్థిక కార్యక్రమాలు మొదలు పెట్టాలని కోరారు. మినెసాటో, మిషిగాన్, వర్జీనియాలో ప్రజలు వెంటనే విధుల్లోకి వెళ్లాలంటూ ట్వీట్‌ చేశారు. న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో ఫెడరల్‌ ప్రభుత్వాన్ని తరచు విమర్శిస్తూ సమయం వృథా చేయకుండా కోవిడ్‌ బాధితుల్ని ఆదుకోవడంలో ఎక్కువ సమయం కేటాయించాలన్నారు.

కోవిడ్‌ మృతుల రేటు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో తొలుత మరణాల శాతం తక్కువగానే ఉన్నప్పటికీ రానురాను పెరిగిపోయింది. మార్చి చివరి నాటికి 1.35%, ఏప్రిల్‌ 15 నాటికి 4%, ఏప్రిల్‌ 18 నాటికి 5%గా మరణాల రేటు మారుతూ వస్తోంది. 

కాగా, కోవిడ్‌ను అరికట్టడానికి అమెరికా అదనపు చర్యలు చేపట్టకపోతే లక్షలాది మంది దారిద్య్రరేఖకి దిగువకి వెళ్లిపోతారని ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల నిపుణులు ఫిలిప్‌ అల్సటాన్‌ హెచ్చరించారు. ఆఫ్రికాలో వెయ్యి మందికి పైగా మరణించారు. మరోవైపున నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్‌ బుహారి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ అబ్బా క్యారీ కోవిడ్‌–19తో ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. జర్మనీలో కరోనా నియంత్రణలో ఉందని, రెండో దశలో విజృంభించకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.  ఇటలీలో ఇప్పుడిప్పుడే జనజీవనం కనిపిస్తూ ఉంటే, స్పెయిన్, మెక్సికో, జపాన్, బ్రిటన్‌ కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి.

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   4 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   6 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   8 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   8 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   9 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle