newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

అమెరికాపై కరోనా మృత్యుపాశం. ఒక్కరోజులో 2,730 మరణాలు. ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల పాజిటిక్ కేసులు

23-04-202023-04-2020 16:37:28 IST
Updated On 23-04-2020 16:44:39 ISTUpdated On 23-04-20202020-04-23T11:07:28.251Z23-04-2020 2020-04-23T11:07:25.530Z - 2020-04-23T11:14:39.946Z - 23-04-2020

అమెరికాపై కరోనా మృత్యుపాశం. ఒక్కరోజులో 2,730 మరణాలు. ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల పాజిటిక్ కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాణాంతక కరోనా వైరస్ నిరోధంపై ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అపహాస్యం చేస్తూ కోవిడ్19 వ్యాధి రోజురోజుకీ విజృంభిస్తూనే ఉంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య బుధవారానికి 26 లక్షలకు చేరువైంది. ఇంతవరకు దీనిబారినపడి లక్షా 80 వేల మందికి పైగా మృతి చెందగా, 7 లక్షల మందికిపైగా కోలుకున్నారు. కోలుకున్న వారందరినీ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.

కాగా అమెరికాలో బాధితుల సంఖ్య 8 లక్షలు దాటిపోగా, 46,400 మందికి పైగా చనిపోయారు. అలాగే స్పెయిన్‌లో కరోనా బాధితులు 2లక్షల పైనే ఉండగా, 21 వేల 282 మంది మృతి చెందారు. ఇటలీలో 1 లక్షా 83 వేల 957 మంది కరోనా వైరస్ బారిన పడగా, 24,648 మంది చనిపోయారు. అలాగే ఫ్రాన్స్ , జర్మనీ , యూకేలో కూడా కరోనా విజృంభిస్తోంది. భారత్‌లో 20 వేలకుపైగా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కొవిడ్‌ బారినపడి బుధవారం ఒక్కరోజే 2,730 మంది చనిపోయారు. ఈ నెల 15న 2,806 మంది చనిపోయారు. ఆ తర్వాత ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో అమెరికాలో మొత్తం మృతుల సంఖ్య బుధవారం సాయంత్రానికి 46,393కి చేరింది. 

కేవలం వారం రోజుల్లోనే మృతుల సంఖ్య రెట్టింపు కావడం అమెరికాలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. బుధవారం కొత్తగా 25,438 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,29,013కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైన దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో కరోనా కేసుల సంఖ్యకు ఇది నాలుగు రెట్లు.

స్పెయిన్‌లో 2.08 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 4,211 మందికి పాజిటివ్‌ వచ్చింది. 435 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 21,717కు పెరిగింది. ఇటలీలో బుధవారం కొత్తగా 3,370 కొత్త కేసులు నమోదు కాగా, 437 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 25,085కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా బుధవారం కొత్తగా 75,011 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 26 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 1.81 లక్షలకు చేరింది. బ్రిటన్‌లో బుధవారం కొత్తగా 4,451 కేసులు నమోదయ్యాయి. 759 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మెత్తం మృతుల సంఖ్య 18,100కు పెరిగింది. కేసుల సంఖ్య 1.33 లక్షలు దాటింది.

ఇరాన్‌లో కొత్తగా 1,194 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 85,996కు పెరిగింది. కరోనాతో ఇరాన్‌లో బుధవారం 94 మంది మృత్యువాత పడ్డారు. పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు అయిన థాయ్‌లాండ్‌లో లాక్‌డౌన్‌ వల్ల లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చాలా మంది నిత్యావసరాల కోసం బంగారాన్ని అమ్ముకుంటున్నారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల క్యాంపుల్లో పరీక్షలు నిర్వహించకపోవడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా శరణార్థి క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 3 వేల మంది కరోనా బారిన పడ్డారు. 55 మంది చనిపోయారు. కాగా, కరోనాపై పోరులో అత్యవసరమైన వైద్య పరికరాలను, టీకాలను అన్ని దేశాలు సమానంగా పొందడానికి వీలుగా మెక్సికో రూపొందించిన తీర్మానాన్ని భారత్‌ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య భేటీ ముందు ప్రతిపాదించగా.. ఆమోదం లభించింది.

కాగా ఆగస్టు 4 నాటికి దాదాపు 66 వేలమంది అమెరికాలో కరోనా వైరస్‌కు బలవుతారని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్  నివేదించింది. ఇది గత అంచనా కంటే ఎక్కువ. కాగా అమెరికాలో తొలి కరోనా మరణం ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఫిబ్రవరి 29న కాకుండా ఫిబ్రవరి 6నే సంభవించినట్లు వాషింగ్టన్ యూనివర్శిటీ నివేదించడం సంచలనం కలిగిస్తోంది. 

చైనా వైరస్ సంబంధింత వాస్తవ సమాచారాన్ని తొక్కిపెడుతోందని ఆరోపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సాక్షాత్తూ వైట్ హౌస్ ప్రామాణికంగా పరిగణించే వాషింగ్టన్ యూనివర్శిటీయే అమెరికాలో తొలి కరోనా మృతి ఫిబ్రవరి 6 నే సంబవించిందని తెలుపటంతో ట్రంప్ పరువు పోయినట్లయింది.

అమెరికన్ కరోనా ఎపి సెంటర్‌గా ఉంటున్న న్యూయార్క్‌లో కరోనా మృతుల సంఖ్య గణనీయంగా తగ్గించి. బుధవారం నగరంలో 474 మరణాలు సంభవించాయని వార్తలు. అయితే సమీపంలో ఉన్న పెన్సిల్వేనియా, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో ఒకే రోజులో అత్యధిక మరణాలు సంభవించడం కలవరపరుస్తోంది.

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle