newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

అమూల్య.. ఆర్ద్ర పేరు ఏదైనా... వివాదాస్పదమే

22-02-202022-02-2020 08:57:59 IST
Updated On 22-02-2020 08:57:56 ISTUpdated On 22-02-20202020-02-22T03:27:59.030Z22-02-2020 2020-02-22T03:27:13.490Z - 2020-02-22T03:27:56.286Z - 22-02-2020

అమూల్య.. ఆర్ద్ర పేరు ఏదైనా... వివాదాస్పదమే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై వివాదం, నిరసనలు రేగుతూనే వున్నాయి. సీఏఏ వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన 'సేవ్ కాన్‌స్టిట్యూషన్' కార్యక్రమంలో ఓ యువతి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసి కలకలం రేపిన సంగతి తెలిసిందే. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించిన తర్వాత వేదిక ఎక్కి మైక్ వద్దకు వచ్చిన అమూల్య అనే యువతి 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేసింది. 

దీంతో వెంటనే అప్రమత్తమైన ఒవైసీ.. ఆమె వద్దకు వచ్చి మైక్ లాక్కుని పక్కకు తీసుకెళ్లారు. పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలను ఖండించిన ఒవైసీ నష్టనివారణ చర్యలకు దిగారు. ఆమెకు ఈ కార్యక్రమానికి సంబంధం లేదని, కార్యక్రమ నిర్వాహకులు ఆమెను ఆహ్వానించలేదని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తాము ఎప్పటికీ పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వబోమని, భారత్‌తోనే ఉంటామని ఒవైసీ స్పష్టం చేశారు.

సీఏఏ వ్యతిరేక ర్యాలీలో 18 ఏళ్ల విద్యార్థిని అమూల్యా లియోనా నినాదాలు చేయడంతో పోలీసులు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆమె హఠాత్తుగా నినాదాలు చేయడంతో అంతా అవాక్కయ్యారు. అమూల్య చేతి నుంచి మైక్ లాక్కుని, ఆమెపై ఐపీసీ సెక్షన్ 124ఎ కింద దేశద్రోహం కేసు పట్టారు. ఆమె దేశ ప్రజల్లో విద్వేషాలు పెంచడానికి ప్రయత్నించింది అని పోలీసులు చెబుతున్నారు. అమూల్య వ్యాఖ్యలపై మండిపడ్డ పోలీసులు ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు.

ర్యాలీలో అమూల్య మైక్ చేతిలోకి తీసుకోగానే 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేసింది. అది వినగానే ర్యాలీ నిర్వాహకులు, స్టార్ స్పీకర్ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మైక్ లాక్కోడానికి అమూల్య వైపు పరిగెత్తారు. ఆమె నినాదాలు చేస్తున్న సమయంలో ఒవైసీ నమాజు కోసం వెళ్లేందుకు వేదిక నుంచి దిగుతున్నారు. తను పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు ఎందుకు చేసిందో తర్వాత ఆమె స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. నిత్యం కేంద్రంపై విమర్శలు చేసే ఓవైసీనే పరుగులు పెట్టించింది అమూల్య. 

ఫ్రీడం పార్కులో అమూల్య వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పలు  హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి  ఆర్థ్రా అనే యువతి వచ్చింది. ఆమె నిరసనకారుల వెనుక ప్లకార్డును పట్టుకుని నిలబడింది. ఆ ప్లకార్డు పోస్టర్‌లో ‘ముసల్మాన్, దళిత్‌ ట్రాన్జ్‌ ఆదివాసి ముక్త్‌’ అని రాసి ఉంది.  ఆ పోస్టర్‌పై ఆందోళనకారులు వ్యతిరేకత వ్యక్తం చేశారు.

పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిందని పలువురు శ్రీరామ సేన కార్యకర్తలు ఆరోపించారు. ఈ సమయంలోయువతిపై పలువురు దూసుకెళుతుండడంతో పోలీసులు యువతిని రక్షించి ఎస్‌.జే.పార్కు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.ప్రస్తుతం ఆమె తమ అదుపులో ఉందని తెలిపారు. ఈ యువతి వెనుక ఎవరు ఉన్నారు. ఎక్కడ నుంచి వచ్చారనే విషయంపై తనిఖీ చేపడుతామని డీసీపీ చేతన్‌ సింగ్‌ రాథోడ్‌ తెలిపారు.

నిరసనల మధ్య ఈ ఇద్దరు యువతులు తమ దూకుడుతో వివాదాస్పదం అయ్యారు.  తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతోందని కర్ణాటక సీఎం బీఎస్‌ యడియూరప్ప ఆరోపించారు. ఆమెకు నక్సలైట్లతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle