newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

02-08-202002-08-2020 06:21:44 IST
2020-08-02T00:51:44.297Z02-08-2020 2020-08-02T00:51:41.069Z - - 03-08-2020

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని తాను కోరుకోవడం లేదని, యథావిధిగా ఎన్నికలు జరగాలని తాను కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట తిప్పారు. సరిగ్గా 24 గంటలకు ముందు నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ట్విటర్‌లో పేర్కొన్న ట్రంప్‌.. తన ప్రతిపాదనపై సొంతపార్టీ రిపబ్లికన్ ప్రతినిధుల నుంచే తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కు తగ్గారు. రోజుకొక మాట మార్చడంలో ఆరితేరిపోయిన ట్రంప్ ప్రత్యర్థుల నుంచి కాకుండా సొంత పార్టీలో కూజా పలుచక కావడం గమనార్హం.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ట్వీట్‌ చేశారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ దృష్ట్యా దేశంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, పోస్టల్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తే అవకతవకలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉందని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా అధ్యక్ష ఎన్నికల్ని వాయిదా వేసే ప్రతిపాదనల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ జాప్యం జరుగుతుందన్న సంకేతాలు పంపుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో మెయిల్‌ ద్వారా వేసే ఓట్లలో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటాయని ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్‌ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే అమెరికాలో ఎన్నికల్ని వాయిదా వెయ్యడం అంత సులభం కాదు.

అమెరికా రాజ్యాంగంలో జాప్యం అన్న పదానికే చోటు లేదు. అయినప్పటికీ ట్రంప్‌ గురువారం ‘‘దేశ చరిత్రలోనే 2020 ఎన్నికల్లో కచ్చితత్వం లోపిస్తుందని, భారీగా అవకతవకలు జరుగుతాయి. దీనివల్ల అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి’’ అని ట్వీట్‌ చేశారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల్లో ఎక్కువ మంది మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. మెయిల్‌ ద్వారా ఓటు వేసే ప్రక్రియలో విదేశీ హస్తం ఉంటుందని ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రజలంతా సురక్షితంగా ఓటేసే పరిస్థితులు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేస్తే ఏమవుతుంది ? అని ట్రంప్‌ ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు. కాగా నవంబర్‌ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం రేపుతోంది.

అప్పుడలా. ఇప్పుడిలా.. 

అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వాయిదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో విపక్ష పార్టీ నేతలు ట్రంప్‌‌పై మండిపడ్డారు. ఇదే సమయంలో సొంత పార్టీ నేతల నుంచి తనకు మద్దతు లభించకపోవడంతో.. తాజాగా ట్రంప్ వెనక్కి తగ్గారు. 

ఈ విషయంపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. కరోనా కాటకు లక్షలమంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది అమెరికన్లు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అయితే కరోనా సృష్టించిన విపత్తునూ.. అమెరికా అధ్యక్షుడు తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వీసాలపై కఠిన ఆంక్షలను విధించారు. అమెరికన్ల మనసు దోచుకునేందుకు ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నా.. ఆయన పాచికలు పారడంలేదు. అమెరికన్లను తన వైపునకు తిప్పుకోలేపోతున్నారు. ఇదే సమయంలో కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్ విఫలమయ్యారని.. ప్రత్యర్థి జో బిడెన్ ఆరోపిస్తున్నారు. అయితే  కరోనా విషయంలో ట్రంప్ మాటలను మెజార్టీ అమెరికన్లు నమ్మడం లేదని పలు సర్వేలు తేల్చేశాయి. 

ఈ నేపథ్యంలో పరిస్థితులు తనకు ప్రతికూలంగా ఉన్నట్లు భావించిన ట్రంప్.. నవంబర్‌లో జరగనున్న ఎన్నికలను వాయిదా వేయాలనే తన మనసులో మాటలను ట్విట్టర్ వేదికగా బటయపెట్టారు. ‘ఇది నిజంగా అమెరికాకు ఇబ్బందికరమే.. ప్రజలు స్వేచ్ఛగా, భద్రతగా ఓటు వేసే సమయం వచ్చేంత వరకు ఎన్నికలు వాయిదా? ’అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా మెయిల్-ఇన్-ఓటింగ్ పద్ధతిని ట్రంప్ బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. 

అయితే ట్రంప్ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీ నేతలు, రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గారు. శ్వేతసౌధంలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని తాను కోరుకోవడం లేదని తెలిపారు. యథావిధిగా ఎన్నికలు జరగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   10 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   13 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


గడువుకు ముందే ప్రియాంక బంగ్లా  ఖాళీ

గడువుకు ముందే ప్రియాంక బంగ్లా ఖాళీ

   31-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle