newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అన్‌లాక్‌ 4.0 కేంద్రం మార్గదర్శకాలు.. మెట్రో గ్రీన్‌ సిగ్నల్‌..

30-08-202030-08-2020 07:36:26 IST
Updated On 30-08-2020 09:04:43 ISTUpdated On 30-08-20202020-08-30T02:06:26.352Z30-08-2020 2020-08-30T02:06:24.787Z - 2020-08-30T03:34:43.004Z - 30-08-2020

అన్‌లాక్‌ 4.0 కేంద్రం మార్గదర్శకాలు.. మెట్రో గ్రీన్‌ సిగ్నల్‌..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు కల్పించింది. కేంద్రం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. సెప్టెంబర్‌ 7 నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. దశల వారిగా మెట్రో సేవల ప్రారంభానికి కేంద్రం అనుమతినిచ్చింది. అలాగే సెప్టెంబర్‌ 30 వరకు పాఠశాలు, మాల్స్‌ తెరవకూడదని కేంద్రం పేర్కొంది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం మరికొన్నాళ్ల పాటు కొనసాగిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు, కోచింగ్‌ కేంద్రాలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, వినోద పార్కులు, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది.

శనివారం విడుదల చేసిన అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాల్లో.. కేంద్రం మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబరు 1 నుంచి 30 వరకు అమల్లో ఉంటాయి. కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సెప్టెంబరు 30 వరకు పొడిగించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ పలు సూచనలు చేసింది.

సెప్టెంబరు 21 నుంచి సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. 100 కంటే ఎక్కువ మందిని అనుమతించకూడదు. నిర్వాహకులు థర్మల్‌ స్కానింగ్‌, హ్యాండ్‌ శానిటైజర్లను అందుబాటులో పెట్టాలి. ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లను 21వ తేదీ నుంచి అనుమతిస్తారు. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు, కోచింగ్‌ కేంద్రాలపై 30 వరకు నిషేధం కొనసాగుతుంది. ఆన్‌లైన్‌ తరగతులు, దూరవిద్యకు అనుమతి ఉంటుంది. 21 నుంచి స్కూళ్లు, కాలేజీల్లో 50శాతం మంది టీచర్లు, సిబ్బందిని అనుమతించవచ్చు. 9-12 తరగతుల విద్యార్థులు అనుమానాల నివృత్తి కోసం స్కూళ్లు, కాలేజీలకు వెళ్లవచ్చు. తల్లిదండ్రులు రాతపూర్వక అనుమతి ఇవ్వాలి.

సెప్టెంబరు 7వ తేదీ నుంచి రాష్ట్రాలు మెట్రోరైళ్లను నడపవచ్చని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అయితే.. కేంద్ర హోంశాఖను సంప్రదించాకే.. పరిమితంగా సేవలను అందించాలని స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేయనుందని వివరించింది. 

కంటైన్మెంట్ జోన్ల వెలుపల స్థానికంగా లాక్ డౌన్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు విధించవద్దని కేంద్రం పేర్కొంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు రాత్రిపూట కర్ప్యూతోపాటు విధించిన ప్రత్యేక లాక్ డౌన్ల కారణంగా అంతర్రాష్ట్ర ట్రాఫిక్, సరుకులు, వాణిజ్య కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితం కావడంతో కేంద్రం స్థానిక లౌక్ డౌన్లకు ఇకపై అనుమతి లేదని ప్రకటించింది.

కేంద్రం ‘అన్‌లాక్‌’ మార్గదర్శకాలు విడుదల

 • అన్‌లాక్‌ 4.0.. మెట్రో రైళ్లకు పచ్చజెండా.. సెప్టెంబరు 7 నుంచి నడపొచ్చు
 • క్రీడా, వినోద, రాజకీయ, మతపరమైన.. కార్యక్రమాలకు సెప్టెంబరు 21 నుంచి ఓకే
 • వంద మంది మించి పాల్గొనకూడదు. 
 • సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి
 • విద్యాలయాల్లో 50శాతం టీచర్లకు అనుమతి.. కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ పొడిగింపు
 • 7 నుంచి హైదరాబాద్‌ మెట్రో నడిచే చాన్స్‌.. సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి
 • సెప్టెంబర్‌ 30 వరకు స్కూళ్లు, మాల్స్‌ బంద్‌.. సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ బంద్‌
 • 100 మందికి మించకుండా స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజకీయ సమావేశాలకు అనుమతి
 • సభలు నిర్వహించే సమయంలో భౌతికదూరం, మాస్క్‌, శానిటైజర్‌ తప్పనిసరి
 • అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలు తొలగింపు.. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
 • చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలన్న కేంద్రం.. అత్యవసరమైతేనే బయటకు రావాలి
 • సెప్టెంబర్‌ 30 వరకు కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు
 • ఈ-పాస్ లేకుండానే అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేయవచ్చు.
ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   2 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   3 hours ago


మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   20 hours ago


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   20 hours ago


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   19 hours ago


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   a day ago


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle