newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

అన్ని ఒప్పందాలను ఉల్లంఘించిన చైనా.. లోక్‌సభలో రాజ్‌నాథ్ స్పష్టం

16-09-202016-09-2020 11:06:46 IST
2020-09-16T05:36:46.265Z16-09-2020 2020-09-16T05:36:43.574Z - - 29-09-2020

అన్ని ఒప్పందాలను ఉల్లంఘించిన చైనా.. లోక్‌సభలో రాజ్‌నాథ్ స్పష్టం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌తో సరిహద్దు సమస్యతో సహా కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనాతో తాము స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నా డ్రాగన్‌ దూకుడుతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతోందని, ద్వైపాక్షిక చర్చలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడుతూ, ద్వైపాక్షిక ఒప్పందాలను చైనా నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. లడఖ్‌లోని దాదాపు 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా అనధికారిక ఆక్రమణలో ఉందన్నారు. 

1963లో జరిగిన సరిహద్దు ఒప్పందంగా చెప్పుకుంటున్నదాని ప్రకారం పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని 5,180 చదరపు కిలోమీటర్ల భారత దేశ భూమిని చైనాకు అప్పగించిందన్నారు. చైనాతో సరిహద్దు వివాదం ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉందని, 1962లో చైనా లడ్డాఖ్‌లో 90 వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందని మంత్రి అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా అంగీకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌ఏసీని ఇరు దేశాలు గౌరవించాలని అన్నారు. 

చైనా ఏకపక్ష చర్యలను భారత్‌ ఖండిస్తోందని, డ్రాగన్‌ కదలికలను పసిగడుతున్నామని మన సైన్యం కూడా అప్రమత్తంగా ఉందని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. మన పొరుగున ఉన్న ఈ రెండు దేశాలు పాల్పడుతున్న అక్రమాలపై మంత్రి ధ్వజమెత్తారు. లడఖ్‌లోని 38 వేల చదరపు కిలోమీటర్ల భూమి చైనా అనధికారిక ఆక్రమణలో ఉందని కుండబద్దలు కొట్టారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని భారత భూభాగాన్ని చట్టవిరుద్ధంగా చైనాకు పాకిస్థాన్ అప్పగించిందన్నారు. 

భారత్‌ శాంతినే కోరుకుంటోందని, సామరస్య చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. చైనా రక్షణ మంత్రితో తాను చర్చలు జరిపానని, యథాతథ స్థితికి భంగం కలిగించే చర్యలు చేపట్టవద్దని ఆయనతో స్పష్టం చేశానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడ్డాఖ్‌కు వెళ్లి సైనికులను కలిశారని గుర్తు చేశారు. చైనాతో  చర్చలకు భారత్‌ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. 

చర్చలు కొనసాగిస్తామని చైనా హామీ ఇస్తున్నా సరిహద్దుల విషయంలో మొండిగా వాదిస్తోందని దుయ్యబట్టారు. తాజాగా ఇరుదేశాల విదేశాంగ మంత్రులు అవగాహనకు వచ్చారని చెప్పారు. ఇక చైనాతో ఉద్రిక్తతలపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చగా ఈ అంశంపై సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు.

చైనా చర్యలు భారత్-చైనా మధ్య కుదిరిన అనేక ద్వైపాక్షిక ఒప్పందాల పట్ల చైనా నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నాయన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా పెద్ద ఎత్తున దళాలను మోహరించడం 1993, 1996లలో ఆమోదించిన ఒప్పందాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో సమస్యలను శాంతియుత చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత దేశం కట్టుబడి ఉందన్నారు. 

ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం తాను చైనా రక్షణ మంత్రితో ఈ నెల 4న మాస్కోలో చర్చలు జరిపానని చెప్పారు. చర్చలు చాలా లోతుగా జరిగాయన్నారు. భారీ సంఖ్యలో దళాలను మోహరించడం, దురాక్రమణ బుద్ధితో ప్రవర్తించడం, యథాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించడం ఆందోళనకరమని చెప్పినట్లు తెలిపారు. 

ఈ సవాలును మన సాయుధ దళాలు విజయవంతంగా ఎదుర్కొంటాయని సభ విశ్వసిస్తోందన్నారు. ఇందుకు మన సైన్యం మనకు గర్వకారణమని చెప్పారు. ప్రస్తుత సమస్య సున్నితమైన కార్యాచరణ అంశాలకు సంబంధించినదని చెప్పారు. దీని గురించి మరిన్ని వివరాలను వెల్లడించబోనని చెప్పారు. చైనా చర్యలకు ప్రతిస్పందిస్తూ మన సాయుధ దళాలు కూడా తగిన విధంగా దళాలను మోహరించినట్లు తెలిపారు. భారత దేశ రక్షణ. భద్రతా ప్రయోజనాలను కాపాడేవిధంగా ఈ ప్రాంతంలో దళాలను మోహరించినట్లు తెలిపారు. 

ఓవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఆగస్టు 29-30 మధ్య రాత్రి ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించిందని, ఈ ప్రయత్నాలను భారతీయ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయని మంత్రి తెలిపారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో జరిగిన ఈ ప్రయత్నాలను భారతీయ దళాలు దీటుగా తిప్పికొట్టినట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మనం కోరుకుంటున్నామని, అందుకే చైనాతో దౌత్యపరమైన, సైనిక పరమైన చర్చలు జరుపుతున్నామని తెలిపారు.

అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

   10 hours ago


ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

   13 hours ago


గడ్డకట్టే చలిలో పోరుకు భారత్ సైన్యం రెడీ..

గడ్డకట్టే చలిలో పోరుకు భారత్ సైన్యం రెడీ..

   16 hours ago


ఆదివాసీలపై అంతటి దారుణాలా..!

ఆదివాసీలపై అంతటి దారుణాలా..!

   27-09-2020


ఓ వైపు ఎన్డీయేకు పార్టీలు దూరం.. మరో వైపు వ్యవసాయ బిల్లు ఆమోదం

ఓ వైపు ఎన్డీయేకు పార్టీలు దూరం.. మరో వైపు వ్యవసాయ బిల్లు ఆమోదం

   27-09-2020


అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

   27-09-2020


బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

   27-09-2020


మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

   27-09-2020


గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

   27-09-2020


వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

   27-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle