newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

అనంత పద్మనాభుడి ఆలయంపై అధికారం వారిదే.. సుప్రీం తీర్పు

13-07-202013-07-2020 13:18:52 IST
Updated On 13-07-2020 18:04:54 ISTUpdated On 13-07-20202020-07-13T07:48:52.142Z13-07-2020 2020-07-13T07:48:09.071Z - 2020-07-13T12:34:54.857Z - 13-07-2020

అనంత పద్మనాభుడి ఆలయంపై అధికారం వారిదే.. సుప్రీం తీర్పు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేరళ పద్మనాభ స్వామి ఆలయం నిర్వహణ ఎవరికి చెందాలనేదానిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయంలో లక్షల కోట్ల విలువైన సంపద ఉంది.  ఆ ఆస్తుల‌పై సుప్రీంలో 9 ఏళ్ల క్రితం కేసు న‌మోదు అయ్యింది. అయితే ఆ కీలకమైన కేసులో ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేప‌ట్టింది.  చ‌రిత్రాత్మ‌క‌మైన ఆల‌యం ఆస్తుల్లో.. ట్రావెన్‌కోర్ రాచ కుటుంబానికి హిందూధ‌ర్మ చ‌ట్టం ప్ర‌కారం హ‌క్కు ఉన్న‌ట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. ఒక‌రి మ‌ర‌ణం వ‌ల్ల దైవారాధ‌న‌కు చెందిన హ‌క్కులు ఆ కుటుంబంపై ప్ర‌భావం చూప‌వ‌ని, ఇది ఆచారం ప్ర‌కారం కొన‌సాగుతుంద‌ని సుప్రీం పేర్కొంది.  

దేవుడి ఆస్తుల‌పై రాజ కుటుంబానికి ఆచారం ప్రకార‌మే హ‌క్కు ఉంటుందని కోర్టు వెల్ల‌డించింది.  ఆల‌య నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి తిరువ‌నంత‌పురం జిల్లా జ‌డ్జి నేతృత్వంలో తాత్కాలిక క‌మిటీని ఏర్పాటు చేసి.. కొత్త క‌మిటీ ఏర్పాటు చేసే వ‌ర‌కు ఆల‌య నిర్వ‌హ‌ణను ఆ క‌మిటీకి అప్ప‌గించాల‌ని కోర్టు ఆదేశించింది. ఆ ఆలయం వెనుక భాగంలో ఉన్న రెండవ నేలమాలిగలో మరింత విలువైన సంపద ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప‌ద్మ‌నాభ‌స్వామి కేసు ఆసక్తికరంగా మారింది. ఆలయ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై  సుప్రీం స్పందించ‌లేదు. ఇవాళ్టి తీర్పులో ఆ అంశాన్ని కోర్టు స్పృశించ‌లేదు.  జస్టిస్‌ ఉదయ్‌ యూ లలిత్‌, ఇందూ మల్హోత్రలకు చెందిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.

2011లో సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న అయిదు నేలమాలిగలను తెరిచిన సంగతి తెలిసిందే. ఆ నేలమాలిగల్లో లక్షల కోట్ల సంపద ఉన్నట్లు గుర్తించారు.  బంగారు, వజ్రాభరణాలు, విగ్రహాలు, ఆయుధాలు, పరికరాలు, నాణాలు ఉన్నట్లు తేల్చారు.  కానీ అత్యంత వివాదాస్పదంగా, ఉత్కంఠభరితంగా మారిన బి నేలమాలిగ గురించి కోర్టు ఏం చెబుతుందన్నది వాస్త‌వానికి ఆసక్తిగా మారింది.  ఆ నేలమాలిగ వద్ద నల్లత్రాచులు పహారా కాస్తున్నట్లు కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

దీన్ని తెరిచినవాళ్లను మరణం వెంటాడుతుందన్న కథలు కూడా ఉన్నాయి. 1931లో ఒకసారి ఈ నేలమాలిగను తెరిచే ప్రయత్నం చేశారని, ఆ సమయంలో దాన్ని తెరిచిన వారు నల్లత్రాచుల నుంచి ప్రాణాలతో తప్పించుకునేందుకు పరుగులు పెట్టినట్లు ప్రచారంలో ఉంది. 

ఆలయ ఆస్తులను ఆడిట్‌ చేసేందుకు నియమితులైన క్యాగ్‌ మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ఆ కథనాలను కొట్టిపారేశారు. 1990 నుంచి బి నేలమాలిగను ఏడు సార్లు ఓపెన్‌ చేసినట్లు ఆయన తన నివేదికలో వెల్లడించారు. పద్మనాభస్వామి ఆలయంలో అక్రమాలు జరిగినట్లు కేసు నమోదు అయ్యింది. దీంతో ఆ ఆలయం పరిపాలనా, నిర్వహణ అంశంపై కేసు సుప్రీంకోర్టులో తొమ్మిది ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది.

2011లో ట్రావెన్‌కోర్‌ రాజ వంశానికి చెందిన చివరి వ్యక్తి మరణించడంతో.. ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మార్తాండ వర్మ కోర్టులో కేసు దాఖలు చేశారు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆలయంలోని ఆరోగదిని తెరిచేదీ లేనిదీ సుప్రీంకోర్టు ట్రావెన్ కోర్ ఫ్యామిలీకే వదిలేసినట్లైంది.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle