newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

09-08-202009-08-2020 12:35:39 IST
2020-08-09T07:05:39.389Z09-08-2020 2020-08-09T07:05:29.029Z - - 30-09-2020

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విమానాశ్రయ రన్‌వే వద్ద సరైన చర్యలు తీసుకోకపోతే శుక్రవారం కోజికోడ్‌లో జరిగిన సంఘటన లాంటిదే భవిష్యత్తులో జమ్మూకశ్మీర్‌, పాట్నా విమానాశ్రయాల్లో కూడా సంభవించే ప్రమాదం ఉందని వాయు భద్రతా నిపుణులు కెప్టెన్‌ మోహన్‌ రంగనాథన్‌ హెచ్చరించారు. కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదాన్ని గతంలోనే ఊహించామని వైమానిక రంగ నిపుణులు వెల్లడించారు. ఈ విమానాశ్రయం కొండలపై ఉండటం, రన్‌వేకు రెండు వైపులా లోయలు ఉండటం వల్ల ఎక్కువ ప్రమాదాన్ని సూచిస్తుందని వారు తెలిపారు. దీనిపై తాము అనేకసార్లు సంబంధిత అధికారులకు విజ‍్ఙప్తి చేసిన వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు. 

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన భద్రతా సలహా కమిటీలో రంగనాథన్ సభ్యుడిగా ఉన్నారు. తొమ్మిదేళ్ల కిందటే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కోజికోడ్‌ రన్‌వే విమానాలు దిగడానికి సరైనది కాదని తాను ఒక నివేదికను సమర్పించినట్లు తెలిపారు.  రంగనాథన్‌ మాట్లాడుతూ.. ‘నా హెచ్చరికను విస్మరించారు. నా అంచనాకు తగ్గట్లే అది ఇప్పుడు జరిగింది. నా అభిప్రాయంలో ఈ ఘటన ప్రమాదం కాదు. హత్య అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన సొంత భద్రతా చర్యల్లోనే సమస్యలు ఉన్నాయి. కోజికోడ్‌ విమానశ్రయం టేబుల్‌ టాప్‌ రన్‌వే. చాలా తక్కువ స్థలాన్ని కలిగి ఉంది. అందువల్ల అక్కడ ఎక్కువ భద్రతా చర్చలు అవసరం అని రంగనాథన్ తెలిపారు. 

కోజికోడ్‌ విమానాశ్రయం రన్‌వే చివరలో 70 మీటర్ల డ్రాప్‌ ఉంది. మంగళూరులో ఇది 100 మీటర్లు ఉంది. ఒక విమానం అదుపు తప్పితే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. సరిగ్గా ఇలాగే జమ్మూ, పాట్నాలో కూడా జరగవచ్చు. ఈ రెండు చోట్ల కూడా సరైన భద్రత చర్యలు లేవు అని ఆయన చెప్పారు.

కోజికోడ్‌ విమానశ్రయంలోని టేబుల్‌ టాప్‌ మిమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన తర్వాత ఓవర్‌షాట్‌ అవ్వడంతో రన్‌వే మీద నుంచి జారీ లోయలోకి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందగా.. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సరిగ్గా ఇంటి ఘటనే 2010లో మంగళూరు విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో విమానం నుంచి మంటలు రావడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.

కోజికోడ్‌ విమాన ప్రమాదంపై తీవ్ర అనుమానాలు

కోజికోడ్‌ విమానాశ్రయంలో జరిగిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఐఎక్స్‌-1334) విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు ప్రారంభించింది. విమానంలోని డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌(డీఎఫ్‌ డీఆర్‌), కాక్‌పీట్‌ వాయిస్‌ రికార్డర్‌(సీవీఆర్‌-బ్లాక్‌బాక్స్‌)లను స్వాధీనం చేసుకుంది. వాటిని విశ్లేషించేందుకు ఢిల్లీకి తరలించింది. అయితే.. బొయింగ్‌ 373-800 విమానం రన్‌వేపై కాకుండా.. ట్యాక్సీవేపై దిగడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

శుక్రవారం సాయంత్రం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం తొలిప్రయత్నంలో రన్‌వేకు ఒకవైపు నుంచి దిగేందుకు ఏటీఎస్‌ అనుమతినిచ్చింది. అక్కడ నీరు ఎక్కువగా నిలవడంతో.. పైలెట్‌ మళ్లీ విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లి, రెండు చక్కర్లు కొట్టారు. ఆ తర్వాత ఏటీఎస్‌ అధికారులు రన్‌వే రెండోవైపు నుంచి దిగాలని సూచించారు. ఆ క్రమంలో రన్‌వేకు కిలోమీటర్లు దూరంలో ఉన్న ట్యాక్సీవేపై పైలట్‌ విమానాన్ని దించారని భారత విమానాశ్రయాల సంస్థ(ఏఏఐ) తన ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. 

ఒక విమానం రన్‌వేపై దిగాక పైలెట్‌కు సూచించిన టెర్మినల్‌కు వెళ్లేందుకు ట్యాక్సీవేపైకి విమానాన్ని పోనిస్తారు. విమానం కిందకు దిగేప్పుడు కొన్ని వందల టన్నుల బరువు రన్‌వేపై పడుతుందని, దాన్ని ట్యాక్సీవే తట్టుకోలేదని ఎయిర్‌పోర్టు ఇంజనీర్లు చెబుతున్నారు.

శుక్రవారం కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో పైలట్, కో పైలట్‌తో సహా కనీసం 18 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ విమానం వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి 190 మంది ప్రయాణీకులను కోజికోడ్‌కి తీసుకువస్తూ ల్యాండింగ్ తప్పిదం కారణంగా పెనుప్రమాదానికి గురైంది.

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

   2 hours ago


ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

   9 hours ago


కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

   12 hours ago


ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

   12 hours ago


నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

   14 hours ago


కోవిడ్ నేర్పిన గుణపాఠం అదే.. ప్రధాని మోదీ

కోవిడ్ నేర్పిన గుణపాఠం అదే.. ప్రధాని మోదీ

   15 hours ago


రైలు ప్రయాణమా.. కాస్త ఖర్చవుతుంది..!

రైలు ప్రయాణమా.. కాస్త ఖర్చవుతుంది..!

   15 hours ago


సరిహద్దుల్లో బ్రహ్మోస్ క్షిపణులు.. యుద్ధానికి భారత్ సన్నద్ధం

సరిహద్దుల్లో బ్రహ్మోస్ క్షిపణులు.. యుద్ధానికి భారత్ సన్నద్ధం

   16 hours ago


అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

   28-09-2020


ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

   28-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle