newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

02-08-202002-08-2020 08:33:57 IST
2020-08-02T03:03:57.539Z02-08-2020 2020-08-02T03:03:48.747Z - - 03-08-2020

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకే రోజు 57 వేల కేసులు, 24 గంటల్లో 764 మరణాలు, 17 లక్షల సంఖ్య దాటేసిన మొత్తం కేసులు.. ఇదీ దేశంలో కరోనా కేసుల విస్తృతి చిట్టా. దేశంలో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో ఏకంగా 57,118 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలకు చేరుకోగా, కోలుకున్న వారి సంఖ్య 10,94,374కు చేరుకుంది. కోవిడ్2019‌ మొత్తం మరణాల సంఖ్య 36,511కు చేరుకోగా, గత 24 గంటల్లో 764 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 5,65,103 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో మరణాల రేటు 2.15కు పడిపోగా, రికవరీ రేటు 64.53కు పెరిగింది. ఇప్పటివరకు ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

భారత్‌లో కరోనా వైరస్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. రోజూ కేసుల సంఖ్య 50 వేల మార్క్ దాట‌డం సాధార‌ణమైన విష‌యంగా మారింది. గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌రోసారి రికార్డ్ స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి. శుక్రవారం ఒక్క  రోజే అత్యధికంగా 57,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 17 లక్షల సంఖ్యను దాటేసింది. 

ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీల్లో అత్య‌ధిక క‌రోనా కేసులు నమోదవుతున్నాయి. లాక్‌ డౌన్‌ విధించినప్పటి నుంచి ఇప్పటి వరకూ చూస్తే ప్రస్తుతం దేశంలో అత్యంత తక్కువ మరణాల రేటు ఉందని కేంద్రారోగ్య శాఖ తెలిపింది. జూన్‌ మధ్యలో 3.33గా ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 2.15కు తగ్గిందని చెప్పింది.

మరణాల రేటు తగ్గిన నేపథ్యంలో స్వదేశంలో తయారైన వెంటిలేటర్లను ఎగుమతి చేసే నిర్ణయానికి మంత్రుల ఉన్నత స్థాయి గ్రూప్‌ అంగీకరించింది. ఈ వెంటిలేటర్ల వల్ల ప్రపంచంలో కొత్త మార్కెట్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో వెంటిలేటర్లను ఇరవైకి పైగా సంస్థలు తయారుచేస్తున్నాయి.

ఢిల్లీలో గ‌ణ‌నీయంగా కేసుల త‌గ్గుద‌ల‌

క‌రోనా కేసులు దేశ రాజ‌ధాని ఢిల్లీలో గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్టాయని ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ తెలిపారు. రోజూ వారి  క‌రోనా కేసుల విష‌యంలో మిగ‌తా  రాష్ర్టాల‌తో పోలిస్తే ఢిల్లీ 12వ స్థానానికి ప‌డిపోయిందని పేర్కొన్నారు. గ‌డిచిన 21 రోజుల్లో దేశ వ్యాప్తంగా కోవిడ్ విజృంభ‌ణ కొన‌సాగుతుండ‌గా ఢిల్లీలో త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని తెలిపారు. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా 1195 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా మొత్తం కేసుల సంఖ్య 1,35,598కు చేరింద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం 10,705 యాక్టివ్ కేసులే ఉన్నాయ‌ని మంత్రి వెల్ల‌డించారు. 

అంత‌కుముందు భార‌త్‌లో అత్య‌ధిక క‌రోనా కేసుల జాబితాలో మ‌హారాష్ట్ర త‌ర్వాత రెండ‌వ స్థానంలో ఉన్న ఢిల్లీలో వ‌రుస‌గా కేసులు త‌గ్గుముఖం ప‌డుతూ వ‌చ్చాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఇప్ప‌డు 496 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయ‌ని చెప్పారు. ఢిల్లీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా ఢిల్లీ స‌రిహ‌ద్దు ప్రాంతాలైన నోయిడా, ఘ‌జియాబాద్, హ‌ర్యానాల‌లో కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని మంత్రి వివ‌రించారు.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   11 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   14 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


గడువుకు ముందే ప్రియాంక బంగ్లా  ఖాళీ

గడువుకు ముందే ప్రియాంక బంగ్లా ఖాళీ

   31-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle