newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

అటు ఆంక్షలు.. ఇటు సంక్షేమం.. మోదీ ది బెస్ట్.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

03-04-202003-04-2020 14:51:15 IST
Updated On 03-04-2020 14:54:52 ISTUpdated On 03-04-20202020-04-03T09:21:15.698Z03-04-2020 2020-04-03T09:20:32.672Z - 2020-04-03T09:24:52.783Z - 03-04-2020

అటు ఆంక్షలు.. ఇటు సంక్షేమం.. మోదీ ది బెస్ట్..  డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ అమలుకోసం కఠిన నిబంధనలను అమలు చేయడంలో ప్రపంచానికే దిశానిర్దేశం చేస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరొకందుకు ఆకాశాన్నెత్తేసింది. మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికై లాక్‌డౌన్‌ అమలు కఠినంగా అమలు చేస్తూనే...కోట్లాది నిరుపేదలను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ గేబ్రియేసస్‌ ప్రశంసించారు. బలహీన వర్గాలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. 

పేద ప్రజలకు ఆహార ధాన్యాల పంపిణీ సహా ఉచితంగా వంటగ్యాసు అందించడం, నగదు బదిలీ వంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌లో ప్రజల కష్టాలు తీర్చలేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్న టెడ్రోస్‌... భారత్‌ మాత్రం సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే

‘‘ భారత్‌లోని బలహీన వర్గాల ప్రజలకు కోవిడ్‌-19 సంక్షోభం నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 24 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయనను అభినందిస్తున్నా. 800 మిలియన్‌ మందికి ఉచిత రేషన్‌, 204 మిలియన్‌ మంది మహిళలకు నగదు బదిలీ.. 80 మిలియన్‌ మంది గృహావసరాల కోసం ఉచిత వంటగ్యాసును మోదీ ఇస్తున్నారు’’ అని టెడ్రోస్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అదే విధంగా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా చూసుకుంటూనే ప్రజలను ఆదుకుంటూ సంఘీభావం ప్రకటించాలని ప్రపంచ దేశాలకు సూచించారు. 

ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకుండా రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు రానున్న మూడు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు, వంటగ్యాస్‌ పంపిణీ చేయడంతోపాటు మహిళలు, సీనియర్‌ సిటిజన్లకు ఆర్థికంగా చేయూత అందివ్వడం వంటి చర్యలను అమలు చేయనున్నట్లు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

ప్రపంచంలోని పలుదేశాలు కోవిడ్-19 ప్రభావాన్ని పరిమితం చేయడానికి ప్రజలందరినీ ఇళ్లలోనే ఉండాలని కోరుతూ జనం కదలికలపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే ప్రభుత్వాల ఈ నిర్బంధ చర్చలు ఆయా దేశాల్లోని అత్యంత నిరుపేదలు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుండటం వాస్తవం. 

కానీ భారత ప్రధాని నరేంద్రమోదీ లాక్ డౌన్ ఆంక్షలను తీవ్రంగా అమలు చేస్తూనే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పనులుకోల్పోయిన కోట్లాదిమంది నిరుపేదలకు 24 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించడం, 80 కోట్లమందికి ఉచిత ఆహార రేషన్ అందించడం, 24 మహిళలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించడం, 8 కోట్ల గృహాలకు ఉచితంగా వంటగ్యాస్ అందించడం మామూలు విషయం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ కొనియాడారు

అర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్న నేపథ్యంలో రుణ ఉపశమనంపై విశాల ప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని, ఈ విషయంలో భారత ప్రధాని అన్ని దేశాల ప్రధానుల కంటే ముందంజ వేస్తున్నారని ప్రశంసించారు 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle