newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

అక్రమ వలసలపై ఉక్కుపాదం

18-07-201918-07-2019 09:14:16 IST
Updated On 18-07-2019 11:37:44 ISTUpdated On 18-07-20192019-07-18T03:44:16.817Z18-07-2019 2019-07-18T03:43:35.739Z - 2019-07-18T06:07:44.476Z - 18-07-2019

అక్రమ వలసలపై ఉక్కుపాదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో అక్రమ వలసలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. అంతర్జాతీయ చట్టాలను అనుసరించి అక్రమ వలసదారులు భారత్‌లో ఎక్కడున్నా, వారిని పంపించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు.

ఇప్పటికే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎన్నార్సీలో పౌరుల వివరాలను నమోదు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ నేత జావేద్‌ అడిగిన ప్రశ్నకు అమిత్‌ ఈ విధంగా జవాబిచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పద్ధతి అమలు చేస్తామన్నారు. 

Image result for citizen ship register

అక్రమ వలసదారులను పంపించేస్తామన్ బీజేపీ మేనిఫెస్టో హామీ కూడా తాము అధికారంలోకి రావడానికి ఓ కారణమన్నారు. ఎన్నార్సీ సేకరణకు అసోంలో సమయాన్ని పొడిగించాలంటూ 25 లక్షల మంది సంతకాలు చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి అందించారని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ అన్నారు.

అసోంలో జరుగుతున్న జాతీయ పౌరుల నమోదు (ఎన్ఆర్‌సీ)లో మరింత పారదర్శకత్వ కోసం ఎన్‌ఆర్‌సీ తుది ప్రచురణ గడువును జూలై 31 నుంచి మరింత పొడిగించే విషయాన్ని పరిశీలిస్తామని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 

వలసదారుల అడ్డుకట్ట వేసేందుకు 1964 ఫారినర్స్ యాక్ట్‌లోని సెక్షన్ 3 కింద కేంద్రానికి అధికారులు ఉన్నాయని కూడా హోం శాఖ చెబుతోంది. ఈ చట్టం కింద దేశంలో ఉంటున్న విదేశీ అక్రమ వలసదారులను గుర్తించి, వారిని నిర్బంధించి, వెనక్కి పంపే హక్కు కేంద్రానికి ఉంటుంది.

ఎన్.ఆర్.సి. చిట్టా తయారైతే "భారతీయులుగా" తమ నైతిక ధర్మం నిర్వర్తించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఇతరులపట్ల తమ బాధ్యతను నిర్వర్తించవచ్చునని ఆశిస్తున్నారు.

భారత పౌరులు ఎవరో చిట్టా తయారు చేయడంవల్ల పౌరులు తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించవచ్చు. చట్టబద్ధంగా పౌరులు ఎవరో అక్రమగా నివాసం ఉంటున్నవారు ఎవరో తేలిపోవాలన్నదే వారి అంతిమ లక్ష్యం. కాని ఇందులో దురుద్దేశం లేకపోతే ప్రభుత్వ విశాల దృక్పథం ప్రయోజనకరం అవుతుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle