newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అందాల లోయ‌లో అల‌జ‌డి ఎందుకు..?

03-08-201903-08-2019 18:00:41 IST
Updated On 13-08-2019 12:39:51 ISTUpdated On 13-08-20192019-08-03T12:30:41.723Z03-08-2019 2019-08-03T12:30:38.713Z - 2019-08-13T07:09:51.577Z - 13-08-2019

అందాల లోయ‌లో అల‌జ‌డి ఎందుకు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

జ‌మ్ము క‌శ్మీర్‌లో అల‌జ‌డి రేగింది. ఎప్పుడూ లేని విధంగా ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో ఏదో పెద్ద నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తోంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా ఈ వారం రోజుల్లో క‌శ్మీర్‌లో ఏకంగా 30 వేల మంది అద‌న‌పు బ‌ల‌గాల‌ను మొహ‌రించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఎప్పుడూ లేని విధంగా అమ‌ర్‌నాథ్, మ‌చైల్ యాత్ర‌లను ర‌ద్దు చేయ‌డం, యాత్రికుల‌ను వెంట‌నే రాష్ట్రం విడిచి వెళ్లాల‌ని ఆదేశించారు. శ్రీన‌గ‌ర్ ఎన్ఐటీలో చ‌దువుతున్న విద్యార్థుల‌ను సైతం వారి స్వంత రాష్ట్రాల‌కు పంపించేస్తున్నారు.

ఇలా కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో జ‌మ్ము క‌శ్మీర్‌లో ఏదో అతిపెద్ద నిర్ణ‌యం తీసుకునేందుకు కేంద్రం సిద్ధ‌మైంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందా అని క‌శ్మీర్ ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. ముఖ్యంగా ఆర్టిక‌ల్ 35ఏ ర‌ద్దు చేసేందుకు కేంద్రం నిర్ణ‌యించింద‌ని, అందుకే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా భ‌ద్ర‌త‌ను పెంచింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, జ‌మ్మును ప్ర‌త్యేక రాష్ట్రంగా చేసిన క‌శ్మీర్‌ను కేంద్ర పాలిట రాష్ట్రంగా మార్చేందుకు కేంద్రం నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు మ‌రో ప్ర‌చారం ఉంది. ఇక‌, స్వ‌తంత్య్ర దినోత్స‌వ వేడుక‌లకు ఈసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌శ్మీర్‌కు వ‌స్తార‌ని, క‌శ్మీర్‌లో ప్ర‌తీ ఊరిలో జాతీయ జెండా ఎగ‌రేసే కార్య‌క్ర‌మానికి బీజేపీ శ్రీకారం చుట్ట‌బొతోందని ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది.

అస‌లు రాష్ట్రంలో ఏం జ‌రుగుతుంద‌నేది ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఏదో అల‌జ‌డి జ‌ర‌గ‌బోతోందని ఆందోళ‌న‌తో ఉన్న ప్ర‌జ‌లు చాలా రోజులకు స‌రిప‌డేలా నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను పోగు చేసుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద వాహ‌న‌దారులు క్యూ క‌డుతున్నారు. క‌శ్మీర్ రాజ‌కీయ పార్టీలకు లోయ‌లో ప‌రిస్థితులు అంతుచిక్క‌డం లేదు. మాజీ ముఖ్య‌మంత్రులు ఓమ‌ర్ అబ్దుల్లా, మ‌హ‌బూబా ముఫ్తీ స‌మావేశ‌మై ప‌రిస్థితిని చ‌ర్చించారు.

అనంత‌రం ఓమ‌ర్ అబ్దుల్లా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి క‌శ్మీర్‌లో ఏం జ‌రుగుతుందో కేంద్రం ప్ర‌క‌టించాల‌ని కోరారు. అయితే ఆర్టిక‌ల్ 35ఏ పైన ఎటువంటి నిర్ణ‌యం ఉండ‌ద‌ని గ‌వ‌ర్న‌ర్ హామీ ఇచ్చార‌ని ఓమ‌ర్ అబ్దుల్లా చెప్పారు. కేవ‌లం ఉగ్ర‌వాద చర్య‌ల‌ను అడ్డుకోవ‌డానికే అద‌న‌పు బ‌ల‌గాలను మొహ‌రించిన‌ట్లు ఆయ‌న చెబుతున్నారు. ఉగ్ర‌వాద ముప్పు ఉన్నట్లు నిఘా స‌మాచారం ఉన్నందునే అమ‌ర్‌నాథ్ యాత్ర‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌భుత్వం చెబుతోంది.

అమ‌ర్‌నాథ్ యాత్ర‌ను ర‌ద్దు చేయ‌డాన్ని ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుబ‌డుతున్నాయి. దేశ‌చ‌రిత్ర‌లో ఎటువంటి ప‌రిస్థితులు త‌లెత్తినా అమ‌ర్‌నాథ్ యాత్ర‌ను మాత్రం ఆప‌లేద‌ని, ఇప్పుడు కేంద్రం పాకిస్థాన్‌కు బ‌య‌ప‌డి అమ‌ర్‌నాథ్ యాత్ర ఆపింద‌ని కాంగ్రెస్ విమ‌ర్శించింది. క‌శ్మీర్‌లో ప‌రిణామాల ప‌ట్ల ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ఆందోళ‌ణ‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఏం జ‌రగ‌బోతుందా అనే ఉత్కంఠ‌తో ఉన్నారు.

 

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   18 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   20 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle