newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

అంతర్జాతీయ సమాజం ముందు పాక్ కు శృంగభంగం

10-08-201910-08-2019 17:39:04 IST
Updated On 13-08-2019 12:37:56 ISTUpdated On 13-08-20192019-08-10T12:09:04.943Z10-08-2019 2019-08-10T12:07:42.871Z - 2019-08-13T07:07:56.034Z - 13-08-2019

అంతర్జాతీయ సమాజం ముందు పాక్ కు శృంగభంగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ కు మరో సారి శృంగభంగం అయ్యింది. కాశ్మీర్ విషయంలో ఆ దేశ అత్యుత్సాహాన్ని ప్రపంచ దేశాలు తలబొప్పికట్టేలా సమాధానం ఇచ్చాయి. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని భారత్ రద్దు చేయడంపై పాకిస్థాన్ చేస్తున్న యాగీని ప్రపంచ దేశాలు గుర్తించలేదు సరికదా, భారత్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం తగదని హితవు చెప్పాయి. అంతే కాదు..భారత్ తీసుకున్న చర్య వల్ల పుల్వామా వంటి ఘటనలు పునరావృతమౌతాయంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యల పట్ల అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. 

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న చర్యపై పాకిస్థాన్ స్పందన మితిదాటిందన్న అభిప్రాయం ప్రపంచ దేశాలు అభిప్రాయపడ్డాయి. అయినదానికీ కానిదానికీ పాకిస్థాన్ ను వెనకేసుకొచ్చే చైనా సహా ఏ దేశమూ కూడా ఈ విషయంలో పాక్ ను సమర్ధించడానికి ముందుకు రాకపోవడం, పైపెచ్చు ఇస్లామిక్ దేశాలు సైతం కాశ్మీర్ విషయంలో పాక్ తీరును ఎండగట్టడంతో ఆ దేశం దాదాపు ఏకాకిగా మారిపోయినట్లైంది.   కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడాన్ని ప్రస్తావించి భారత్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాలన్న పాకిస్థాన్ వ్యూహం ఘోరంగా విఫలమైంది. కాశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచం యావత్తూ సమర్థించడానికి కారణం ఈ విషయంలో భారత్ ఇంత కాలం చూసిన సహనం, ఓర్పే కారణమనడంలో సందేహం లేదు. 

ఇక కాశ్మీర్ లో స్వాతంత్ర్య పోరాట యోధుల హక్కులను హరించి వేస్తున్నారనీ, ఆర్టికల్ 370 రద్దుతో అక్కడ వారి పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తమౌతున్నదంటూ..ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని కోరిన పాకిస్థాన్ కు అక్కడా చుక్కెదురైంది. ఈ విషయంలో మధ్యవర్తిత్వానికి ఐక్యరాజ్య సమితి నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ద్వైపాక్షిక అంశాన్ని అంతర్జాతీయం చేయడం సరికాదని పైపెచ్చు పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పింది. భారత్‌-పాక్ మధ్య 1972 నాటి సిమ్లా ఒప్పందాన్ని గుర్తు చేయడంతో పాకిస్థాన్ దిక్కు తోచని స్థితిలో పడినట్లైంది.  

కాశ్మీర్ విషయంలో  ధర్డ్ పార్టీ మీడియేషన్ (మధ్యవర్తిత్వానికి) అవకాశం లేదని ఐరాస పాక్ కు స్పష్టం చేసేయడంతో ఇక భారత్ కు వ్యతిరేకంగా ప్రపంచంలో ఏ దేశమూ మద్దతు ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఐరాస స్పష్టీకరణతో ఆర్టికల్ 370 రద్దు, రెండు రాష్ట్రాలుగా (యూనియన టెరిటరీలుగా) కాశ్మీర్ విభజన పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమన్నది అలంతర్జాతీయ సమాజం అంగీకరించినట్లయ్యింది. ఇక ఈ విషయంలో ప్రపంచంలోని ఏ దేశం నుంచీ పాకిస్థాన్ కు కనీస ఓదార్పు కూడా దక్కని పరిస్థితి ఉంది. 

తలారి దొరికాడు.. నిర్భయ హంతకులకు ఇక ఉరే!

తలారి దొరికాడు.. నిర్భయ హంతకులకు ఇక ఉరే!

   19 hours ago


డ్వేన్ బ్రేవో కమల్‌తో భేటీ.. ఎందుకంటే?

డ్వేన్ బ్రేవో కమల్‌తో భేటీ.. ఎందుకంటే?

   11-12-2019


దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు: రిటైర్డ్ జడ్జితో విచారణ

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు: రిటైర్డ్ జడ్జితో విచారణ

   11-12-2019


పీఎస్‌ఎల్వీ సీ-48 రీ శాట్ 2 బి ఆర్ 1 ప్రయోగం సక్సెస్

పీఎస్‌ఎల్వీ సీ-48 రీ శాట్ 2 బి ఆర్ 1 ప్రయోగం సక్సెస్

   11-12-2019


చిలీ మిలటరీ విమానం మిస్సింగ్.. అసలేం జరిగింది?

చిలీ మిలటరీ విమానం మిస్సింగ్.. అసలేం జరిగింది?

   10-12-2019


ఉద్యోగుల చేతికి మరింత జీతం.. ప్రభుత్వ ట్రిక్కుతో ఇది సాధ్యమే

ఉద్యోగుల చేతికి మరింత జీతం.. ప్రభుత్వ ట్రిక్కుతో ఇది సాధ్యమే

   10-12-2019


పెళ్ళిలో సర్ ప్రైజ్ గిఫ్ట్ లు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే!

పెళ్ళిలో సర్ ప్రైజ్ గిఫ్ట్ లు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే!

   10-12-2019


చేతులు కాలాక ఆకులు.. ఉన్నావ్ కేసులో పోలీసులపై వేటు

చేతులు కాలాక ఆకులు.. ఉన్నావ్ కేసులో పోలీసులపై వేటు

   09-12-2019


విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా జోజిబినీ టూంజీ: సమాధానంతో ప్రాంగణం చిత్తు

విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా జోజిబినీ టూంజీ: సమాధానంతో ప్రాంగణం చిత్తు

   09-12-2019


నిర్భయ హంతకుల ఉరి శిక్షకు ముహూర్తం రెడీ

నిర్భయ హంతకుల ఉరి శిక్షకు ముహూర్తం రెడీ

   09-12-2019


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle