newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

అంతర్జాతీయ విమాన సర్వీసులు జూలైలోనే?

17-06-202017-06-2020 09:20:26 IST
Updated On 17-06-2020 09:20:04 ISTUpdated On 17-06-20202020-06-17T03:50:26.064Z17-06-2020 2020-06-17T03:49:02.244Z - 2020-06-17T03:50:04.956Z - 17-06-2020

అంతర్జాతీయ విమాన సర్వీసులు జూలైలోనే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా వుంది. ఈ నేపథ్యంలో తర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత కొనసాగుతోంది. లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించిన క్రమంలో అంతర్జాతీయ విమాన రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాలపై నియంత్రణలను ఎత్తివేసే దిశగా వచ్చే నెలలో నిర్ణయం వెలువడుతుందని పౌర విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ చెప్పారు. 

కరోనా తీవ్రత, కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రయాణీకులు, ఎయిర్‌లైన్స్‌ సహా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ విమాన సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని నిర్ధిష్టంగా తాను వెల్లడించలేనని చెప్పారు. కాగా ఎయిర్‌పోర్ట్‌ల్లో విమానాల సంఖ్యపై పరిమితులతో మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను అనుమతించింది కేంద్రం. 

విదేశాల్లో వున్న భారతీయులను వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి రప్పించిన సంగతి తెలిసిందే. పలు దేశీయ, విదేశీ విమానయాన  సంస్థలు త్వరగా సేవలు ప్రారంభించాలని భావిస్తున్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. లాక్ డౌన్ ప్రారంభించాక రెండునెలల అనంతరం మే 25 నుంచి దేశీయ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. దేశీయ విమానాలు తిరిగి ప్రారంభమైన రోజు నుంచి ఈ నెల 15వరకు 1,35,954 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని, ఇందుకు 1,464 విమాన సర్వీసులను వినియోగించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 

విదేశాలకు వెళ్లే వారి కోసం జూలై నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. జూన్ 30 వరకూ అంతర్జాతీయ విమానయాన సర్వీసులపై నిషేధం ఉంది. జూన్ 30 తర్వాత లాక్ డౌన్ ముగిశాక విదేశీ విమానయాన సర్వీసులపై నిర్ణయం వెలువడవచ్చు. 

అదేవిధంగా అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించేముందు అన్ని విమానయాన సంస్థలు కరోనా వైరస్ నియంత్రణ కోసం మిడిల్ సీటు ఖాళీగా వుంచాల్సి వుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్య సీటు ఖాళీగా ఉంచమని విమానయాన సంస్థలకు డీజీసీఏ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోతుంది. టికెట్ ధరలను నియంత్రించడం కూడా కష్టమవుతుందని గతంలో కేంద్రం సుప్రీంకు వివరించింది.

అయితే మిడిల్ సీట్లను కూర్చునే వారు ప్రొటెక్టవ్ ఎక్విప్‌మెంట్ ధరించాలని డీజీసీఏ పేర్కొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వరుసగా కూర్చోవచ్చని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని సర్దుబాట్లు చేశాక విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ లభించవచ్చు. ఇప్పటికే విమానాల్లో వినియోగించే ఫ్యూయల్ ఛార్జీలు పెరిగాయి. అంతేకాదు వివిధ విమానయాన సంస్థలు తమ సిబ్బందిలో భారీగా కోత విధించాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు తక్కువ సర్వీసులే నడపనున్నాయి. దీంతో రానున్న రోజుల్లో విమాన ప్రయాణం కాస్త ఖరీదుతో కూడుకోనుంది. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   7 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle