newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

అంతటి ఉగ్రవాదికీ కుటుంబంపై మమకారమే.. సరిగ్గా అక్కడే దొరికాడు

07-05-202007-05-2020 18:03:41 IST
Updated On 07-05-2020 18:16:34 ISTUpdated On 07-05-20202020-05-07T12:33:41.619Z07-05-2020 2020-05-07T12:33:38.077Z - 2020-05-07T12:46:34.380Z - 07-05-2020

అంతటి ఉగ్రవాదికీ కుటుంబంపై మమకారమే.. సరిగ్గా అక్కడే దొరికాడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉగ్రవాదులపై పోరులో భద్రతా దళాలు భారీ విజయం సాధించాయి. గత ఎనిమిదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ రియాజ్‌ నైకూ (35)ను మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపోరాలోని బీఘ్‌పోరా, షార్షల్లి గ్రామాల్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య బుధవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో బీఘ్‌పోరాలో రియాజ్‌ నైకూతో పాటు అతని అనుచరుడు, షార్షల్లిలో మరో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. 

నైకూ తలపై రూ.12 లక్షల రివార్డు ఉంది. అతడితోపాటు మరో ముగ్గురు ఉగ్రవాదులను కూడా సైనికులు హతమార్చారు. భద్రతా దళాలకు చెందిన ఎనిమిది మంది సిబ్బందిని హంద్వారాలో పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులను మూడు రోజుల్లోనే మన జవాన్లు హతమార్చి ప్రతీకారం తీర్చుకోవడం విశేషం.

హిజ్బుల్‌ చీఫ్‌ రియాజ్‌ హతం వెనుక ఒక అరుదైన విషయం వెల్లడయింది. మంగళవారం రాత్రి సొంతగ్రామమైన బీఘ్‌పోరాలో నైకూ దాక్కున్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు నైకూ పారిపోకుండా భద్రతా దళాలు అతడి స్థావరాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. దీంతో బలగాలపై నైకూ, అతని అనుచరుడు కాల్పులు జరపడంతో బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. 12 గంటల పాటు ఈ కాల్పులు కొనసాగాయి. 

ఎన్‌కౌంటర్‌ ప్రాంతం నుంచి ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా బలగాలు రక్షణ కవచంగా నిలిచాయి. మధ్యాహ్నం ఓ ఉగ్రవాది బయటకు వచ్చి బలగాలపై కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అతను హతమయ్యాడు. అనంతరం ఆ స్థావరానికి వెళ్లి చూడగా నైకూ, అతని అనుచరుడి శవాలు కనిపించాయని అధికారులు తెలిపారు. 

సొంత ఊరైన బీఘ్‌పోరాలోనే నైకూ హతమవడం విశేషం. నైకూ మృతితో శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని భావించిన అధికారులు లోయవ్యాప్తంగా ప్రైవేట్‌ ఆపరేటర్ల మొబైల్‌, టెలిఫోన్‌ సేవలను నిలిపివేశారు. రియాజ్‌ నైకూను మట్టుబెట్టిన భద్రతా బలగాలపై కాంగ్రెస్‌ పార్టీ ప్రశంసల జల్లు కురిపించింది. ‘ఉగ్రవాది నైకూకు తగిన శాస్తి చే   సినందుకు  భద్రతా బలగాలను అభినందిస్తున్నాను’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

రియాజ్‌ నైకూ మృతితో హింసకు పాల్పడవద్దని ప్రజలకు జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. తుపాకీ పట్టిన మరు క్షణమే అతడి మరణం నిశ్చయమైపోయిందని ఒమర్‌ ట్వీట్‌ చేశారు. ఆయన ఈ ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే పుల్వామాలో అల్లరిమూకలు హింసకు పాల్పడ్డాయి. 

హిజ్బుల్‌ చీఫ్‌ రియాజ్‌ నైకూకు గణితం అంటే అమిత మక్కువ. ఉగ్రవాదిగా మారక ముందు గణిత టీచర్‌గా పనిచేశాడు. 2012లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరాడు. రైతు కుమారుడైన ఇతను.. పుల్వామాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. మోస్ట్‌ వాంటెడ్‌, ఏ++ ఉగ్రవాదిగా ఇతనికి రేటింగ్‌ ఉంది. అతడిని మట్టుబెట్టిన ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్‌ జాక్‌బూట్‌’ అని అధికారులు పేరుపెట్టారు. 

ఎనిమిదేళ్లపాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని సైనిక బలగాలకు సవాలు విసిరిన కరడు గట్టిన ఉగ్రవాది కూడా కన్నతల్లిపై మమకారంతో సొంత ఊరికి వచ్చి అక్కడే భారత సైనికులు చేతిలో హతమవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జీవితమే వద్దనుకుని ఉగ్రవాద బాట పట్టిన వారు కూడా కుటుంబాలను, మమకారాలను వదులుకోలేక అక్కడే జీవితాన్ని ముగించుకోవడం ఉగ్రవాదుల శిక్షణా సామర్థ్యంపైనే అనుమానాలు రేకెత్తిస్తోంది.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle