newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

IPL2020: భారీ సిక్సర్ కొట్టిన శిఖర్ ధావన్..!

14-09-202014-09-2020 17:41:20 IST
Updated On 14-09-2020 18:45:47 ISTUpdated On 14-09-20202020-09-14T12:11:20.735Z14-09-2020 2020-09-14T12:11:14.592Z - 2020-09-14T13:15:47.003Z - 14-09-2020

IPL2020: భారీ సిక్సర్ కొట్టిన శిఖర్ ధావన్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యంగ్ ట్యాలెంట్ ఉన్న టీమ్ ఐపీఎల్ లో ఏదంటే ఢిల్లీ కేపిటల్స్ జట్టు అని చెబుతూ ఉంటారు. ఈ యంగ్ టీమ్ ఒక్కసారైనా ట్రోఫీ నెగ్గాలనేది క్రికెట్ ప్రేమికుల అభిలాష. ఐపీఎల్ 13వ ఎడిషన్ త్వరలోనే మొదలు కాబోతూ ఉండడంతో ఢిల్లీ కేపిటల్స్ జట్టు కూడా ప్రాక్టీస్ ను ముమ్మరం చేసింది. అందుకు సంబంధించిన వీడియోలను ఢిల్లీ కేపిటల్స్ జట్టు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ ఉంది.

తాజాగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, భారతజట్టు స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు భారీ సిక్సర్ కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శిఖర్ ధావన్ ఐపీఎల్ లో ఢిల్లీ కేపిటల్స్ కు ఆడుతుండగా.. ఈ ఏడాది ఢిల్లీ కేపిటల్స్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చి చేరాడు. ప్రాక్టీస్ లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్ బృందం రెండు భాగాలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. అందులో అశ్విన్ కు శిఖర్ ధావన్ భారీ సిక్సర్ ను కొట్టాడు.

ఫేవరెట్స్ గా భావించవచ్చు:

ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఐపీఎల్ ఫైనల్ కు చేరలేదు. కానీ 2020 ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఢిల్లీ జట్టు అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందని అందరూ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది.

యంగ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉండగా శిఖర్ ధావన్, ప్రథ్వి షా, అజింక్యా రహానే లతో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. షిమ్రాన్ హెట్మయర్, మార్కస్ స్టోయినిస్, రిషబ్ పంత్ లతో మిడిల్ ఆర్డర్ మరింత బలంగా ఉంది. అలెక్స్ కేరీ కూడా టీ20లలో మంచి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఢిల్లీకి స్పిన్ బౌలింగ్ అటాక్ ఈ సీజన్ కు చాలా ప్లస్ గా మారబోతోందని అంచనా వేస్తూ ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్, సందీప్ లెమిచానేలు మంచి స్పిన్ బౌలర్లు. యుఏఈ పిచ్ లు స్పిన్ కు అనుకూలం కావడంతో ఢిల్లీ స్పిన్నర్లు మ్యాచ్ ను మలుపు తిప్పే అవకాశం ఉంది. ఢిల్లీ జట్టులో మంచి ఫాస్ట్ బౌలర్ లేకపోవడం మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మలు పేస్ బౌలింగ్ లో ఎలా రాణిస్తారో చూడాలి.    


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle