newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

IPL2020: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఫస్ట్ అమెరికన్ ప్లేయర్...

12-09-202012-09-2020 17:59:46 IST
Updated On 12-09-2020 18:03:50 ISTUpdated On 12-09-20202020-09-12T12:29:46.777Z12-09-2020 2020-09-12T12:29:44.074Z - 2020-09-12T12:33:50.069Z - 12-09-2020

IPL2020: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఫస్ట్ అమెరికన్ ప్లేయర్...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అలీ ఖాన్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ను చూసిన వాళ్లకు ఈ ఆటగాడు పరిచయమే..! మంచి పేస్ బౌలింగ్, అవసరమైనప్పుడు యార్కర్లు వేస్తూ ఛాంపియన్ గా నిలిచిన ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టులో అలీ ఖాన్ కూడా ఒకడు. ఈ ఆటగాడికి అదృష్టం కలిసి వచ్చింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో మంచి ప్రదర్శన ఇవ్వడంతో ఐపీఎల్ ఆడే అవకాశాన్ని అందుకున్నాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఆడనున్నట్లు తెలుస్తోంది. 29 ఏళ్ల అలీఖాన్‌ యూఎస్‌ఏ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్‌ నుంచి కేకేఆర్‌ ఆటగాడు హారీ గర్నీ భుజం గాయం కారణంగా  వైదొలగడంతో.. అతని స్థానంలో అలీఖాన్‌ను తీసుకోనుంది కేకేఆర్‌.  అమెరికా నుంచి ఐపీఎల్‌ ఆడిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందనున్నాడు.

వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో తనతో పాటూ అలీ ఖాన్ కూడా దుబాయ్ కు వస్తున్నట్లు తెలిపాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో బ్రేవో కూడా ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరపునే ఆడాడు. కానీ ఐపీఎల్ లో బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ ఉండగా.. అలీ ఖాన్ కేకేఆర్ కు ఆడబోతున్నాడు.  

టీ20 లీగుల్లో ఇప్పటికే మెరిసిన అలీ ఖాన్:

అలీ ఖాన్ గత మూడు సంవత్సరాలుగా టీ20ల్లో రాణిస్తూ ఉన్నాడు. 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేయగలడు. పలు టీ20 టోర్నీలలో అలీ ఖాన్ ఆడాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ తరపున , బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఖుల్నా టైటాన్స్ తరపున, ఆఫ్ఘనిస్థాన్ ప్రీమియర్ లీగ్ లో కాబూల్ జ్వానన్ టీమ్స్ తరపున ఆడాడు.  

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ జట్టులో సభ్యుడు. 2018లో యుఎస్ఏ కెన్యా మీద విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో అలీ ఖాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలి.  

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   11 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   15 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   a day ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   a day ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle