newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

IPL 2020: యుఏఈ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు

17-09-202017-09-2020 08:21:16 IST
2020-09-17T02:51:16.065Z17-09-2020 2020-09-17T02:49:59.370Z - - 30-09-2020

IPL 2020: యుఏఈ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ద్వారా మొదలుపెట్టనుంది. సెప్టెంబర్ 19, అబుదాబీ లోని షేక్ జాయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఐపీఎల్ లో మంచి విజయాలు సాధించిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ఒకటి. 5 మ్యాచ్ లలో 4 మ్యాచ్ లలో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. విజయాల శాతం 80 ఉంది.

కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు మాత్రమే చెన్నై కంటే మంచి రికార్డు యూఏఈలో ఉంది. 5 మ్యాచ్ లలో 5 గెలిచింది పంజాబ్ జట్టు. చెన్నై గతంలో ఆడిన అయిదు మ్యాచ్ లలో ఒకటి షార్జాలో కాగా.. దుబాయ్, అబుదాబీలలో రెండ్రెండు మ్యాచ్ లు ఆడింది.

యూఏఈ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గణాంకాలను పరిశీలిస్తే:

3  సెంచరీలు డ్వేన్ స్మిత్ యూఏఈలో బాదాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసింది అతడే..!

3 ఒకే ఇన్నింగ్స్ లో సురేష్ రైనా పట్టిన క్యాచ్ లు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రైనా మూడు క్యాచ్ లు పట్టాడు.

4/14 మోహిత్ శర్మ బెస్ట్ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. మంచి బౌలింగ్ ప్రదర్శన చేసిన చెన్నై బౌలర్ అతడే.

5 రైనా యూఏఈలో అత్యధిక క్యాచ్ లు పట్టిన చెన్నై ఆటగాడు. మొత్తం 5 క్యాచ్ లు పట్టుకున్నాడు.

6 చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు చేసిన హాఫ్ సెంచరీలు

8 మోహిత్ శర్మ తీసిన వికెట్లు. ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా మోహిత్ శర్మ నిలిచాడు.

15 డ్వేన్ స్మిత్ కొట్టిన సిక్సర్లు. ఎక్కువ సిక్సర్లు కొట్టిన సిఎస్కే ఆటగాడు.

33 మొత్తం చెన్నై ఆటగాళ్లు బాదిన సిక్సర్లు.

71* బ్రెండన్ మెక్ కాలమ్ కొట్టినదే అత్యధిక పరుగులు. ముంబై ఇండియన్స్ మీద మెక్ కాలమ్ కొట్టాడు.

140/6 రాజస్థాన్ రాయల్స్ చెన్నై మీద చేసిన పరుగులు. ఇదే అత్యల్ప స్కోరు.

205/4 కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మీద చేసిన అత్యధిక పరుగులు

240 డ్వేన్ స్మిత్ చేసిన పరుగులే చెన్నై సూపర్ కింగ్స్ తరపున యుఏఈలో చేసిన అత్యధిక పరుగులు. 

రాజస్థాన్‌ విజయ పరంపర కొనసాగేనా..?

రాజస్థాన్‌ విజయ పరంపర కొనసాగేనా..?

   8 hours ago


బాధను బయటపెట్టిన రషీద్ ఖాన్.. ఇన్ని విషాదాలు చోటు చేసుకున్నాయా

బాధను బయటపెట్టిన రషీద్ ఖాన్.. ఇన్ని విషాదాలు చోటు చేసుకున్నాయా

   10 hours ago


ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్‌.. భారీ జరిమానా

ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్‌.. భారీ జరిమానా

   11 hours ago


డ్రీమ్ లెవెన్ కు అలా షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

డ్రీమ్ లెవెన్ కు అలా షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

   13 hours ago


వింటేజ్ రషీద్ ఖాన్.. దుమ్ము దులిపాడుగా..!

వింటేజ్ రషీద్ ఖాన్.. దుమ్ము దులిపాడుగా..!

   14 hours ago


కదం తొక్కిన సన్ రైజర్స్ బౌలర్లు.. కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్

కదం తొక్కిన సన్ రైజర్స్ బౌలర్లు.. కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్

   15 hours ago


రైనా, హర్భజన్ పేర్లను తీసేసిన చెన్నై సూపర్ కింగ్స్

రైనా, హర్భజన్ పేర్లను తీసేసిన చెన్నై సూపర్ కింగ్స్

   29-09-2020


రెండు సూపర్ ఓవర్ మ్యాచ్ ల లోనూ అదే పొరపాటు..!

రెండు సూపర్ ఓవర్ మ్యాచ్ ల లోనూ అదే పొరపాటు..!

   29-09-2020


థ్రిల్లింగ్ మ్యాచ్ పై అనుష్క స్పందన..!

థ్రిల్లింగ్ మ్యాచ్ పై అనుష్క స్పందన..!

   29-09-2020


ఇషాన్ కిషన్ సూపర్ ఓవర్ ఆడడానికి ఎందుకు రాలేదో చెప్పిన రోహిత్..!

ఇషాన్ కిషన్ సూపర్ ఓవర్ ఆడడానికి ఎందుకు రాలేదో చెప్పిన రోహిత్..!

   29-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle