newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

IPL 2020: బిగ్ బాస్ ఇల్లులా ఉందంటున్న శిఖర్ ధావన్

17-09-202017-09-2020 09:36:58 IST
2020-09-17T04:06:58.823Z17-09-2020 2020-09-17T04:06:52.353Z - - 19-04-2021

IPL 2020: బిగ్ బాస్ ఇల్లులా ఉందంటున్న శిఖర్ ధావన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐపీఎల్ అతి త్వరలో మొదలుకాబోతోంది. ఇంకొద్ది రోజులే..! ఐపీఎల్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహిస్తూ ఉన్నారు. ఆటగాళ్లందరూ బయో బబుల్ నుండి బయటకు వెళ్ళకూడదు. ఎక్కడ చూసినా చాలా జాగ్రత్తలే.. బయటకు వెళ్ళడానికి వీలు లేదు.. ఆటగాళ్లందరూ ఖచ్చితంగా రూల్స్ ను గౌరవించాలని చెబుతూ ఉన్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ బయో బబుల్ ను బిగ్ బాస్ తో పోల్చాడు.

సుమారు 80 రోజులపాటు అన్ని జట్ల ఆటగాళ్ల ప్రపంచాలు మారిపోనున్నాయని శిఖర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వారు హోటల్ నుంచి మైదానానికి, మ్యాచ్ పూర్తికాగానే తిరిగి హోటల్ కు చేరుకుంటారు. మ్యాచ్ ఆడే స్టేడియాల్లో ప్రేక్షకులు ఎవరూ ఉండరు. ఖాళీ స్టేడియాల్లో స్థిరంగా గెలుపే ధ్యేయంగా ఆడాల్సి ఉంటుంది.

ఇది అచ్చం టీవీలో వచ్చే బిగ్ బాస్ షోలా ఉందని అన్నాడు.  సీజన్ టోర్నమెంట్‌లో విజయం.. ఆటగాళ్ళు ఈ కొత్త రియాలిటీని ఎలా నావిగేట్ చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందని ధావన్ చెబుతున్నాడు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ ఆడడం కూడా కొత్తగా ఉంటుందని వివరించాడు.

IPL 2020 bio-secure bubble almost like living in 'Big Boss' house, jokes Shikhar  Dhawan | Eagles Vine 

పలువురు ఆటగాళ్లు, జట్ల కెప్టెన్ లు బయో బబుల్ ను గౌరవించాలని కోరారు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తమ ఆటగాళ్లకు క్లాస్ పీకాడు. దుబాయ్ చూడడానికి మనం రాలేదని.. ప్రస్తుత పరిస్థితులను గౌరవించి అందుకు తగ్గట్టుగా మసలుకోవాలని కోరాడు.  

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle