IPL 2020: అబుదాబీ షేక్ జాయేద్ స్టేడియం సర్వం సిద్ధం
18-09-202018-09-2020 15:49:16 IST
2020-09-18T10:19:16.473Z18-09-2020 2020-09-18T10:19:12.821Z - - 11-04-2021

దాదాపు ఆరు నెలల గ్యాప్ తర్వాత ఐపీఎల్ 2020 మొదలుకాబోతోంది. సెప్టెంబర్ 19న గత ఏడాది ఫైనల్ కు రీమ్యాచ్ గా ముంబై ఇండియన్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు అబుదాబీ లోని షేక్ జాయేద్ స్టేడియం వేదికగా కానుంది. ఐపీఎల్ సీజన్ ఓపెనర్ కాకుండా మొత్తం 19 లీగ్ స్టేజ్ మ్యాచ్ లను షేక్ జాయేద్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మిగిలిన లీగ్ మ్యాచ్ లు దుబాయ్ షార్జా వేదికగా జరగనుంది. కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు మాత్రమే అబుదాబీ లోని హోటల్స్ లో ఉంటున్నాయి. మిగిలిన జట్లు మ్యాచ్ ల సమయంలో దుబాయ్ కు రానున్నాయి. షేక్ జాయేద్ స్టేడియం కెపాసిటీ 20000 కాగా, కరోనా కారణంగా స్టేడియంలో ఒక్క అభిమాని కూడా ఉండడు. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు అబుదాబీ గ్రౌండ్ లో 100 శాతం విజయాలు సాధించింది. ఈ ఏడాది ఏ జట్లకు కలిసొస్తుందో చూడాలి. పిచ్ రిపోర్టు: షేక్ జాయేద్ స్టేడియంలో గత పది సంవత్సరాలలో 45 టీ20 మ్యాచ్ లు జరిగాయి. అత్యధిక పరుగులు 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు. పిచ్ బ్యాట్స్మెన్ కు అనుకూలించనుంది. స్పిన్ బౌలర్లు కూడా రాణిస్తారు. ఈ గ్రౌండ్ లో రన్ రేట్ 7 తో ఉంటుంది.. 150 పరుగులు దాటితే మంచి స్కోరు అయ్యే అవకాశం ఉంది. షేక్ జాయేద్ స్టేడియంలో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన జట్టుగా హాంగ్ కాంగ్ పేరిట రికార్డు ఉంది. ఆఫ్ఘనిస్థాన్ జట్టు మీద హాంగ్ కాంగ్ 163 పరుగులను ఛేజ్ చేసింది. స్పిన్నర్లు మాత్రమే కాకుండా ఈ పిచ్ మీద మీడియం పేసర్లు కూడా రాణిస్తారు. యూఏఈ జట్టుకు చెందిన మీడియం బౌలర్ రోహన్ ముస్తఫా 11 టీ20లలో 15 వికెట్లు తీశాడు. వాతావరణం: మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం లేదని చెబుతూ ఉన్నారు. 35 డిగ్రీలకు దగ్గరగా ఉష్ణోగ్రత ఉంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండనుంది.

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్ల ప్రశంసల జల్లు
11 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
13 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
19 hours ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-2021
ఇంకా