newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

IPL లో రోహిత్ శర్మ సరిగ్గా రాణించలేక పోయాడు

16-09-202016-09-2020 16:20:50 IST
2020-09-16T10:50:50.706Z16-09-2020 2020-09-16T10:50:48.606Z - - 19-04-2021

IPL లో రోహిత్ శర్మ సరిగ్గా రాణించలేక పోయాడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు.. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా నాలుగు టైటిల్స్ అందించాడు. కానీ ఐపీఎల్ లో ఓ సీజన్ మొత్తం రోహిత్ శర్మ అద్భుతంగా రాణించిన దాఖలాలు లేవు.. 2016 ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ ఎలాంటి మెరుపులైతే మెరిపించాడో అలా రోహిత్ శర్మ ఇప్పటి వరకూ ఏ సీజన్ లోనూ అద్భుతమైన ప్రదర్శన చేయలేదు. కొన్ని కొన్ని సీజన్లలో అసలు రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్టుగా ఆడుతున్నాడా..? అనే అనుమానాలు కూడా వచ్చాయి.

తాజాగా ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ బ్రెట్ లీ రోహిత్ శర్మ బ్యాటింగ్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడడం వలన ముంబై ఇండియన్స్ కు మంచి ఆరంభాలను ఇవ్వాలని బ్రెట్ లీ సూచించాడు. వీలైనన్ని పరుగులు చేయడం ద్వారా ముంబై ఇండియన్స్ కెప్టెన్ తన మీద ఉన్న ప్రెజర్ ను దించేసుకోగలుగుతాడని బ్రెట్ లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

రోహిత్ శర్మ మొదట పరుగులు చేయాల్సి ఉంటుంది.. అతడు గొప్ప లీడర్ కావచ్చు.. నాయకుడే ముందు నిలబడి ఎక్కువ పరుగులు చేస్తే జట్టుకు కూడా చాలా మంచిది అవుతుంది. మిగిలిన వాళ్ళు కూడా రాణించగలరు. జట్టులో ఉన్న ఇతర ఆటగాళ్ళ కంటే రోహిత్ శర్మకు అనుభవం ఎక్కువ ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మంచి ప్రదర్శన కూడా ఇచ్చాడు.. బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ రాణిస్తే ముంబై టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలు మరింత ఎక్కువ ఉంటుందని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు.

ముంబై ఇండియన్స్ జట్టు మంచి సమతూకంతో ఉందని.. గత ఏడాది ఛాంపియన్ గా నిలిచిన ఈ జట్టుకు ఈ ఏడాది కూడా మంచి జట్టు ఉందని బ్రెట్ లీ అన్నాడు. పొలార్డ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ ఎంత గొప్పగా ఆడుతాడో అందరికీ తెలిసిందే.. బుమ్రా కూడా టీ20ల్లో గొప్ప బౌలర్.. ముంబై ఇండియన్స్ జట్టు అన్ని విషయాల్లో పటిష్టంగా ఉందని అన్నాడు బ్రెట్ లీ. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle