CSK టీం పై బజ్జి ఆసక్తికర వ్యాఖ్యలు..
05-09-202005-09-2020 07:57:49 IST
Updated On 05-09-2020 08:01:32 ISTUpdated On 05-09-20202020-09-05T02:27:49.341Z05-09-2020 2020-09-05T02:27:41.944Z - 2020-09-05T02:31:32.686Z - 05-09-2020

కొన్ని రకాల కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో నాకు కాస్త ఏకాంతం కావాలి. నేను నా కుటుంబంతో గడపదల్చుకున్నాను అంటూ ఐపీఎల్-2020 నుంచి తప్పుకుంటున్నందుకు కారణాలను సీనియర్ ఆఫ్ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ వెల్లడించాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ టోర్నీకి దూరమవుతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చినా... శుక్రవారం భజ్జీ దానిని అధికారికంగా ప్రకటించాడు. ‘వ్యక్తిగత కారణాలతో నేను ఈ ఏడాది ఐపీఎల్ ఆడటం లేదు. కొన్ని రకాల కఠిన పరిస్థితులను ఎదుర్కొం టున్న తరుణంలో నాకు కాస్త ఏకాంతం కావాలి. నేను నా కుటుంబంతో గడప దల్చుకున్నాను. సీఎస్కే జట్టు మేనేజ్మెంట్ నాకు అన్ని విధాలా అండగా నిలిచింది. ఆ జట్టు ఐపీఎల్లో బాగా ఆడాలని కోరుకుంటున్నా, జైహింద్’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. చెన్నైలో నిర్వహించిన శిబిరానికి దూరంగా ఉన్న భజ్జీ ఆగస్టు 21న జట్టుతో కలిసి ప్రయాణించలేదు. ఈ నెల 1న అతను దుబాయ్ వస్తాడని భావించినా అదీ జరగలేదు. దాంతో లీగ్‌లో హర్భజన్ పాల్గొనడంపై సందేహాలు రేగాయి. ఇప్పటికే సురేశ్ రైనా కూడా తప్పుకోవడంతో చెన్నై జట్టు ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయినట్లయింది. ప్రస్తుతం 40వ పడిలో పడిన హర్బజన్ జలంధర్‌లో కుటుంబంతో ఉంటూ తనకు కాస్త గోప్యత కావాలని అభ్యర్థించాడు. ఈ సంవత్సరం ఐపీఎల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు నేను ఇప్పటికే సీఎస్కే యాజమాన్యానికి సమాచారమిచ్చాను. నేటి కఠిన పరిస్థితుల్లో కేవలం వ్యక్తిగత కారణాలతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా గోప్యతను అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాను.. అని భజ్జీ ఒక ప్రకటనలో తెలిపాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన బౌలర్లలో హర్భజన్ ఒకడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతను మూడో స్థానంలో ఉన్నాడు. 2008 నుంచి 2017 వరకు పది సీజన్ల పాటు హర్భజన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో చెన్నై జట్టులోకి వచ్చిన అతను టీమ్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది రన్నరప్‌గా నిలవడంలో కూడా భజ్జీ పాత్ర ఉంది. ఓవరాల్‌గా 160 ఐపీఎల్ మ్యాచ్‌లలో 7.05 ఎకానమీతో 150 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 160 మ్యాచ్‌లకు గాను 150 వికెట్లు సాదించిన మూడో బౌలర్‌గా హర్భజన్ రికార్డు సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో దీపక్ చహార్తో పాటు ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటికే కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. కాగా ఇప్పటికే సీఎస్కే జట్టులో 13 మందికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. సెఫ్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ పోటీలు యూఏఈలో జరగనున్నాయి.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
13 hours ago

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ
15-04-2021

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
15-04-2021

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
15-04-2021

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
14-04-2021

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
14-04-2021
ఇంకా