newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

CSK కష్టాలు.. మూడో స్థానంలో ఎవరు..?

15-09-202015-09-2020 18:11:40 IST
2020-09-15T12:41:40.780Z15-09-2020 2020-09-15T12:41:36.148Z - - 15-04-2021

CSK కష్టాలు.. మూడో స్థానంలో ఎవరు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు టైటిల్‌ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రత్యర్థిపై విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే.. అందరి పరిస్థితి ఎలా ఉన్నా చెన్నై సూపర్‌ కింగ్స్‌ పరిస్థితి మాత్రం కొంత గందరగోళంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ రుతురాజ్‌ ఇంకా కరోనా పాజిటివ్‌తోనే బాధపడుతున్నాడు. 14 రోజులుగా క్వారంటైన్‌లో ఉన్నా కానీ.. ఇంకా అతను ఈ మహమ్మారి నుంచి బయట పడలేదు. దీంతో జట్టు ప్రణాళికలు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది.

దుబాయ్‌ చేరుకున్న చెన్నై జట్టులో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వారిని వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. పేసర్‌ దీపక్‌ చాహర్‌ త్వరగానే ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. మిగతా జట్టు సిబ్బంది కూడా కోలుకున్నారు. చాహర్‌ ఇప్పటికే జట్టులో కలిసి ప్రాక్టీస్‌ మొదలెట్టాడు.

ఇక చెన్నై జట్టు కీలక ఆటగాడు సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో టాప్‌ ఆర్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌లో చక్కగా బ్యాటింగ్‌ చేయగల రుతురాజ్‌ను ఆడించాలని చెన్నై మేనేజ్‌మెంట్ బావించినట్లు తెలుస్తోంది.

అయితే.. అతడు ఇంకా కరోనా నుంచి కోలుకోక పోవడంతో.. ప్రస్తుతం మూడో స్థానంలో మరో ఆటగాడి కోసం చెన్నై వెతుకుతోంది. కాగా.. అంబటి రాయుడుని ఆస్థానంలో బరిలోకి దించాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరీ చెన్నై ఎవరిని మూడో స్థానంలో ఆడిస్తుందో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.  సెప్టెంబర్‌ 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. కొవిడ్‌ కారణంగా.. మరో ఐదు రోజుల తరువాత తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం చెన్నైకి ఇచ్చినప్పటికి ధోని తిరస్కరించాడు. 

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   3 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   7 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   20 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   a day ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle