newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

3 వ T20 లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్

31-08-202031-08-2020 12:03:45 IST
Updated On 31-08-2020 12:26:43 ISTUpdated On 31-08-20202020-08-31T06:33:45.372Z31-08-2020 2020-08-31T06:32:55.657Z - 2020-08-31T06:56:43.543Z - 31-08-2020

3 వ T20 లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ పేలవ ప్రదర్శన టీ20 సిరీస్‌లోనూ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌ని 0-1తో చేజార్చుకున్న పాకిస్థాన్.. మూడు టీ20ల సిరీస్‌లోనూ 0-1తో వెనకబడింది.వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దవగా.. మాంచెస్టర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో చెలరేగిపోయిన ఇంగ్లాండ్ టీమ్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 195 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ టీమ్ 19.1 ఓవర్లలోనే ఛేదించేయడం గమనార్హం. ఇక ఆఖరి టీ20 సెప్టెంబరు 1న మాంచెస్టర్ వేదికగానే జరగనుంది.

మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్.. కెప్టెన్ బాబర్ అజామ్ (56: 44 బంతుల్లో 7x4), మహ్మద్ హఫీజ్ (69: 36 బంతుల్లో 5x4, 4x6) హాఫ్ సెంచరీలు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 

భారీ స్కోరు కావడంతో.. పాకిస్థాన్ శిబిరం గెలుపు ధీమాతో కనిపించింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఆదిల్ రషీద్ (2/32), క్రిస్‌ జోర్దాన్ (1/41), టామ్ కురాన్ (1/46) మాత్రమే ఫర్వాలేదనిపించారు.

196 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ టామ్ బాంటన్ (20) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో (44: 24 బంతుల్లో 4x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడేశాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన డేవిడ్ మలాన్ (54: 36 బంతుల్లో 6x4, 1x6)తో కలిసి దూకుడుగా ఆడిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (66: 33 బంతుల్లో 6x4, 4x6) ఇంగ్లాండ్‌ని గెలుపు తీరాలకి చేర్చాడు.

మలాన్-మోర్గాన్ జోడీ.. మూడో వికెట్‌కి ఏకంగా 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. మోర్గాన్ ఔటయ్యే సమయానికి ఇంగ్లాండ్ 16.5 ఓవర్లలో 178/3తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆఖర్లో డేవిడ్ మలాన్ గెలుపు లాంఛనాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే 199/5తో పూర్తి చేశాడు.

 

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   13 hours ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle