newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హ్యాట్రిక్‌ విజయంతో సెమీస్‌లో భారత మహిళల జట్టు

27-02-202027-02-2020 15:14:31 IST
2020-02-27T09:44:31.561Z27-02-2020 2020-02-27T09:44:29.572Z - - 11-04-2021

హ్యాట్రిక్‌ విజయంతో సెమీస్‌లో భారత మహిళల జట్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూజిలాండ్‌లో భారత పురుషుల జట్టు అటు వన్డేల్లో, ఇటు టెస్టుల్లో కూడా వరుస పరాజయాల బారిన పడుతున్న నేపథ్యంలో భారత మహిళా జట్టు మహిళల టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంది. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో  భారత జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. గ్రూప్‌-ఎలో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకున్న టీమిండియా సెమీస్‌ బెర్తును అందరికంటే ముందుగా ఖాయం చేసుకుంది. 

కివీస్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దాంతో 134 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్‌ వరకూ కివీస్‌ పోరాడినా విజయాన్ని సాధించలేకపోయింది. చివరి ఓవర్‌లో కివీస్‌ విజయానికి 16 పరుగులు కావాల్సిన తరుణంలో ఆ జట్టు 11 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది.. 

మెల్‌బోర్న్ మహిళల టీ-20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ మహిళ జట్టు తొలి పరాజయాన్ని చవిచూసింది. జంక్షన్ ఓవెల్ వేదికగా భారత్‌తో జరిగిన ఉత్కంఠపోరులో కివీస్ జట్టు స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. ఆల్ రౌండర్ అమిలియా కెర్ర్ జట్టుకు విజయాన్ని అందించేందుకు ఆఖరి బంతి వరకూ పోరాడిన ఫలితం భారత్‌కు అనుకూలంగానే వచ్చింది. 

కివీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో అమేలియా కెర్‌(34 నాటౌట్‌; 19 బంతుల్లో 6 ఫోర్లు) చివరి వరకూ పోరాటం కొనసాగించగా, మ్యాడీ గ్రీన్‌(24), క్యాటీ మార్టిన్‌(25)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలింగ్‌లో శిఖా పాండే, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌లు తలో వికెట్‌ తీశారు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. న్యూజిలాండ్‌తో  మ్యాచ్‌లో షపాలీ(34 బంతుల్లో46; 4ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్‌ గెలిచిన కివీస్‌.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో  ఓపెనర్‌ స్మృతి మంధాన (11) వచ్చి వెళ్లగా.. అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన తానియా భాటియా కాసేపు మెరుపులు మెరిపించారు. అయితే అదే ఊపులో రోజ్‌మెరి బౌలింగ్‌లో తానియా(23) క్యాచ్‌ ఔటాయ్యారు. అయితే మరోవైపు షఫాలీ తనదైన రీతిలో బ్యాటింగ్‌ చేస్తూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో పదిఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. 

అయితే పదకొండో ఓవర్‌ నుంచి కివీస్‌ గేమ్‌ ప్లాన్‌ మార్చింది. భారత బ్యాటర్స్‌కు ఊరించే బౌలింగ్‌ వేస్తూ వికెట్లను పడగొట్టింది. అయితే కీవీస్‌ ప్లేయర్స్‌ అనే క్యాచ్‌లను జారవిడచడంతో టీమిండియా బ్యాటర్‌కు అనేక అవకాశాలు లభించాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమ్యారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్‌(10) నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఇన్నింగ్స్‌ చివరి బంతి వరకు సాగింది. హర్మన్‌(1), దీప్తి శర్మ(8), వేదా కృష్ణమూర్తి(6) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దాంతో భారత్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. అయినప్పటికీ ఆ స్కోరును కాపాడుకుని మరో గెలుపును అందుకోవడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. గ్రూప్‌ స్టేజ్‌లో భారత మహిళలు తమ చివరి మ్యాచ్‌ను శనివారం శ్రీలంకతో ఆడనున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle