హైదరాబాద్ VS బెంగళూరు.. బోణి ఎవరిదో..?
21-09-202021-09-2020 14:37:16 IST
Updated On 21-09-2020 15:41:35 ISTUpdated On 21-09-20202020-09-21T09:07:16.067Z21-09-2020 2020-09-21T09:07:14.237Z - 2020-09-21T10:11:35.543Z - 21-09-2020

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. దుబాయ్ వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) తలపడనుంది. ఇరు జట్లుకు ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీలో ఘనంగా బోణి కొట్టాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఐపీఎల్ ప్రారంభమైనప్పటికి నుంచి ప్రతి సీజన్లలో టైటిల్ ఫేవరేట్ జట్లలో ఆర్సీబీ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి సారి కప్ మనదే అంటూ రావడం.. ఖాళీ చేతులతో వెనుదిరగడం ఆర్సీబీకి అలవాటుగా మారింది. ఈ సారి లోగోతో పాటు జెర్సీని కూడా మార్చేసింది. మరీ ఈ సారైన ఆర్సీబీ తలరాత మారుతుందో లేదో చూడాలి. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ లాంటి విధ్వంసకారులు ఆ జట్టు సొంతం. ఇద్దరిలో ఏ ఒక్కరు నిలిచినా ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు. వీరిద్దరే ఆ జట్టుకు బలం, బలహీనత. వీరిద్దరిపైనే ఆ జట్టు అతిగా ఆధారపడుతుంది. వీరిద్దరు విఫలమైతే.. ఇక అంతే సంగతులు. ఈ బలహీనతలు ఈ సీజన్లో అధిగమించాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. ఆరోన్ పించ్, మోయిన్ అలీ, క్రిస్‌మోరిస్ వంటి ప్లేయర్లు ఉండడంతో బ్యాటింగ్ విభాగంలో దుర్భేద్యంగా కనిపిస్తోంది. అయితే.. బౌలింగ్ విభాగమే ఆ జట్టుకు కాస్త కలవరానికి గురి చేస్తోంది. ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, చాహల్, ఆడమ్ జంపా రాణించడంపైనే ఆర్సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన ఆయుధం.. జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నరే. ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్‌కు ఐపీఎల్లో తిరుగులేని రికార్డు ఉంది. మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన వార్నర్.. 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఈసారి కూడా అతనిపై భారీ అంచనాలున్నాయి. ఓపెనర్ జానీ బెయిర్ స్టో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఈ ఇద్దరు మంచి ప్రారంభాలను అందిస్తున్నారు. అయితే.. తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లును ఎవరిని ఎంచుకోవాలనే దానిపైనే ఎస్ఆర్హెచ్ కసరత్తు చేస్తోంది. ఓపెనర్లు ఇద్దరు(వార్నర్, బెయిర్ స్టో) ఖచ్చితంగా ఆడతారు. బౌలింగ్ విషయానికి వస్తే రషీద్‌ఖాన్ ఎలాగూ తీసుకోవాల్సిందే. స్పిన్ ఆల్‌రౌండర్‌గా మహమ్మద్ నబీకి దుబాయ్‌లో ఆడిన అనుభవం ఉంది. ఒక వేళ ఈ నలుగురు జట్టులో ఉంటే.. మాజీ కెప్టెన్, కివీస్ ఆటగాడు విలియమ్ సన్ పరిస్థితి ఏంటి..? నబీ, విలియమ్ సన్లలో ఎవర్ని తీసుకుంటారు..? వెరసి హైదరాబాద్ జట్టు కూర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారింది. ఐపీఎల్ అన్ని జట్లలో హైదరాబాద్ బౌలింగ్ విభాగం ఉన్నంత పటిష్టంగా మరే జట్టుకు లేదడనంలో అతి శయోక్తి లేదు. భువనేశ్వర్‌కుమార్, సందీప్ శర్మ, రషీద్‌ఖాన్, మహ్మద్నబీ లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలరు. కింగ్స్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మైదానంలోనే ఈ మ్యాచ్ జరుగుతుండటంతో ఆ మ్యాచ్ పరిస్థితులే రిపీట్ కానున్నాయి. స్పిన్‌కు బాగా అనుకూలించే పిచ్. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కే మొగ్గు చూపవచ్చు. తొలుత బౌలింగ్ అనుకూలిస్తూ.. తర్వాత బ్యాటింగ్‌కు సులువయ్యే పరిస్థితులుంటాయి. ఐపీఎల్ చరిత్రలో ఈ ఇరు జట్లు 15 సార్లు తలపడగా 8-6తో సన్‌రైజర్స్ లీడ్‌లో ఉంది. అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. మరీ ఏ జట్టు శుభారంభాన్ని అందుకుంటుందో చూడాలి.

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
5 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
7 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
13 hours ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్‌ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-2021
ఇంకా