newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హాకీని వేధిస్తున్న మహమ్మారి.. మన్ దీప్ సింగ్‌కి కరోనా

10-08-202010-08-2020 17:33:39 IST
2020-08-10T12:03:39.097Z10-08-2020 2020-08-10T12:00:59.881Z - - 19-04-2021

హాకీని వేధిస్తున్న మహమ్మారి.. మన్ దీప్ సింగ్‌కి కరోనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత దేశాన్నే కాదు ప్రపంచాన్నే వణికిస్తోంది కరోనా వైరస్. తాజాగా హాకీ ప్లేయర్లు కరోనా బారినపడి ఇబ్బంది పడుతున్నారు. జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. హాకీ ఆటగాళ్ళలో ఆరో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో మరోసారి అలజడి రేగింది. హాకీ ఆటగాడు మన్‌దీప్‌ సింగ్‌కు కరోనా వైరస్ పాజిటివ్ బారిన పడ్డాడు. మన్‌దీప్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది.  

దీంతో హాకీ ఆటగాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. ఆగస్టు 20వ తేదీ నుంచి నేషనల్‌ క్యాంప్‌ ఆరంభించడానికి సిద్ధం అవుతున్న వేళ వరుసగా క్రీడాకారులు కరోనా బారిన పడటం గుబులు పుట్టిస్తోంది. దాంతో జాతీయ క్యాంపును వాయిదా వేసే పరిస్థితిపై భారత హాకీ సమాఖ్య చర్చలు జరుపుతోంది. గతవారం భారత హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు మరో నలుగురు కోవిడ్‌ బారిన పడ్డారు. సుదీర్ఘ విరామం తర్వాత సాయ్‌ సెంటర్‌కు వెళ్లిన క్రమంలో వీరికి కరోనా సోకింది. సాయ్‌ సెంటర్‌కు 20 మంది ఆటగాళ్లు హాజరు కాగా అందులో ఆరుగురికి కరోనా సోకింది. 

కరోనా సోకిన హాకీ ఆటగాళ్లలో మన్‌దీప్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌లతో పాటు సురేంద్ర కుమార్‌, జస్కరన్‌ సింగ్‌, వరుణ్‌ కుమార్‌, కృష్ణ బహుదుర్‌ పాఠక్‌లు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు సాయ్‌ వెల్లడించింది. వీరిని మిగతా ఆటగాళ్ళకు దూరంగా వుంచాలని భావిస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle