newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

స్మృతి మంధానకు గాయం.. ఆ సిరీస్ సఫారీలదేనా?

09-10-201909-10-2019 16:06:36 IST
2019-10-09T10:36:36.567Z09-10-2019 2019-10-09T10:36:34.775Z - - 19-02-2020

స్మృతి మంధానకు గాయం.. ఆ సిరీస్ సఫారీలదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రీడాకారుల గాయాల ప్రభావం టీంపై తప్పక పడుతుంది. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు వెళ్లనున్న టీమిండియా మహిళల జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్టే కనిపిస్తోంది. టీమిండియా ఓపెనర్‌ స్మృతి మంధాన బొటన వేలి గాయం కావడంతో దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి ఆమె తప్పుకుంది.

మంగళవారం ప్రాక్టీస్‌లో భాగంగా ఈ క్రికెటర్‌ బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. వివిధ రకాల వైద్య పరీక్షల అనంతరం మంధానకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలపడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈమె స్థానంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

గాయంతో మంధాన దూరంగా ఉండడంతో బ్యాటింగ్‌ భారం మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లపై పడనుంది. అది టీమిండియా విజయావకాశాలను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాప్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక ఇప్పటికే టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఇదిలా ఉంటే.., మంధాన లేకపోవడంతో... వన్డే సిరీస్‌ను గెలిచి ప్రతీకారం తీర్చుకోవడానికి సఫారీ జట్టు తెగ ప్రయత్నాలు చేస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle