newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్టోక్స్ వచ్చేనా.. రాజస్థాన్ బెంగ తీరేనా..?

16-09-202016-09-2020 06:27:01 IST
2020-09-16T00:57:01.877Z16-09-2020 2020-09-16T00:56:58.397Z - - 15-04-2021

స్టోక్స్ వచ్చేనా.. రాజస్థాన్ బెంగ తీరేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే.. వివిధ దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లంతా కలిసి ఆడే గొప్ప ఈవెంట్..! అప్పుడప్పుడు కొన్ని కొన్ని కారణాల వలన కొందరు ఆటగాళ్లు జట్లకు దూరమవుతూ ఉంటారు. అయితే స్టార్ ఆటగాళ్లు ఒక్కోసారి దూరమైతే మాత్రం ఆయా ఫ్రాంచైజీలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అలాంటి ఆటగాళ్ల లిస్టులోనే బెన్ స్టోక్స్ ఉంటాడు. బెన్ స్టోక్స్ ఏ జట్టులో ఉన్నా కూడా బలమే.. అందుకే రాజస్థాన్ రాయల్స్ జట్టులో అతడు స్టార్ ఆటగాడయ్యాడు. రాజస్థాన్ కు మంచి విజయాలు అందించాడు ఈ స్టార్ ఆల్ రౌండర్..!

ఇక ఐపీఎల్ మొదలవ్వడానికి కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికీ బెన్ స్టోక్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చేరనున్నాడో లేదో క్లారిటీ లేదు. బెన్ స్టోక్స్ తండ్రికి బ్రెయిన్ క్యాన్సర్ రావడంతో గత నెలలో పాకిస్థాన్ తో టెస్ట్ సిరీస్ నుండి వైదొలిగాడు. అప్పటి నుండి స్టోక్స్ క్రికెట్ ఆడలేదు.

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ కూడా బెన్ స్టోక్స్ జట్టుతో ఎప్పుడు కలుస్తాడో  తమకు కూడా సరైన అవగాహన లేదని తెలిపాడు. అతడికి  కావాల్సిన సమయం తాము ఇస్తామని.. అతడికి ఇష్టమున్న సమయానికి రావచ్చునని ఆండ్రూ మెక్ డొనాల్డ్ చెబుతున్నాడు. కుటుంబంలో ఇలాంటి కష్ట సమయాలు వచ్చినప్పుడు ఆటగాడికి అండగా ఉండాలని అన్నారు. అందుకే స్టోక్స్ కు తగినంత సమయం ఇవ్వాలని అనుకుంటున్నామన్నారు. స్టోక్స్ ప్రస్తుతం ఎక్కడ వున్నాడో మాకు కూడా సరైన అవగాహన లేదని అన్నాడు. స్టోక్స్ తన నిర్ణయం తెలియజేసే వరకూ ఎదురుచూస్తూ ఉంటామని.. అతడికి కావాల్సిన సమయం ఇస్తామని మెక్ డొనాల్డ్ తెలిపాడు.    

స్టోక్స్ జట్టులో లేకపోతే రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్ దెబ్బతినే అవకాశం ఉంది. గత సీజన్ లో మెరుపులు మెరిపించిన రియాన్ పరాగ్ మీద ఈ సారి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. స్టోక్స్ లాంటి మరో ఆటగాడు దొరకడం కష్టమే..! డేవిడ్ మిల్లర్ మిడిల్ ఆర్డర్ లో.. టామ్ కుర్రన్ లోయర్ ఆర్డర్ లో రావాల్సి ఉంటుంది. 

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   an hour ago


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   2 hours ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   6 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   9 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   a day ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle