newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

31-05-202031-05-2020 10:36:45 IST
Updated On 31-05-2020 11:05:15 ISTUpdated On 31-05-20202020-05-31T05:06:45.952Z31-05-2020 2020-05-31T05:06:28.671Z - 2020-05-31T05:35:15.246Z - 31-05-2020

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్ పండుగ గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఐపీఎల్ నిర్వహణపై రోజుకో రకంగా వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడు దాదా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా అన్ని వ్యవస్థల్లో మార్పులు వచ్చినట్టుగానే క్రికెట్ రంగం పై కూడా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. క్రికెట్ షెడ్యూల్స్ లో మార్పులు ఉంటాయని అన్నారు. అయినా, ఐసీసీతో కలిసి క్రికెట్ ను సాధారణ స్థితికి తీసుకుని వస్తామన్నారు.

క్రికెట్ చాలా శక్తిమంతమైన క్రీడ అని, ఆటగాళ్లకు కూడా కొన్ని పరీక్షలు తప్పవని చెప్పారు. భారతీయుల్లో ప్రతిఘటించే శక్తి అధికమని, ప్రస్తుతానికి ఔషధాలు లేకున్నా, అతి త్వరలోనే కరోనాకు వాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఉందని గంగూలీ వ్యాఖ్యానించారు. చిన్న వయసులో ఒడిశాపై చేసిన శతకం, లార్డ్స్ మైదానంలో చేసిన సెంచరీ, తనకు మధుర స్మృతులని చెప్పారు. మరోవైపు 2020లొనే ఐపీఎల్‌ జరుగుతుందని ఆశిస్తున్నట్టు టీమ్‌ఇండియా స్పిన్‌ దిగ్గజం, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

షెడ్యూల్‌లో సర్దుబాటు చేస్తే టోర్నీ నిర్వహించేందుకు అవకాశం ఉందని తాను అనుకుంటున్నట్టు ఓటీవీ షోలో చెప్పాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయని మేం నమ్మకంతో ఉన్నాం. ప్రేక్షకులు లేకుండా.. మూడు, నాలుగు వేదికల్లోనైనా టోర్నీ సాధ్యమవుతుందని అనుకుంటున్నాం. అందరం ఆశావాదంతో ఉన్నాం’ అని కుంబ్లే చెప్పాడు. ఎక్కువ స్టేడియాలు ఉన్న నగరాల్లో ఐపీఎల్‌ నిర్వహిస్తే ప్రయాణాలను తగ్గించే అవకాశం ఉంటుందని బ్యాటింగ్‌ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. కాగా కరోనా ప్రభావం కారణంగా ఈ ఏడాది జరుగాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడింది. ప్రేక్షకులు లేకుండానే టీవీలలో లైవ్ టెలికాస్ట్ ద్వారా మ్యాచ్ లు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle