newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సౌరవ్ గంగూలీ ఇంట కరోనా వైరస్ తంటా

20-06-202020-06-2020 14:16:51 IST
Updated On 20-06-2020 15:29:03 ISTUpdated On 20-06-20202020-06-20T08:46:51.124Z20-06-2020 2020-06-20T08:46:42.588Z - 2020-06-20T09:59:03.566Z - 20-06-2020

సౌరవ్ గంగూలీ ఇంట కరోనా వైరస్ తంటా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ప్రభావం అన్నిరంగాల్లోని వ్యక్తులపై పడుతోంది. రాజకీయ, సామాజిక, మీడియా, క్రీడాకారులను కరోనా వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ ఇంట మరోసారి కరోనా వైరస్ రచ్చరేపుతోంది. గంగూలీ అన్నయ్య, వారి కుటుంబసభ్యులైన బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి స్నేహాశిష్‌ భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

ఇప్పటికే స్నేహశిష్‌ అత్తామామలకు, వారి ఇంట్లో పనిచేసే వ్యక్తి కరోనా బారిన పడ్డారు. దీంతో దాదా కుటుంబంలో ఇంకెవరికి కరోనా వైరస్ సోకిందో అర్థం కావడంలేదంటున్నారు. ఈ కరోనా కేసులు పెరుగుతుండటం అభిమానులను వణికిస్తోంది. నలుగురు గంగూలీ కుటుంబీకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పరీక్షించగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం వీరు ఓ ప్రయివేట్‌ నర్సింగ్‌ హోమ్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే వీరు గంగూలీ కుటుంబీకులే కానీ ఒకే ఇంట్లో ఉంటున్న వారు కాదు. ప్రస్తుతం కరోనా సోకిన ఈ నలుగురి ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తుల వివరాల గురించి తెలుసుకుంటున్నారు అధికారులు.

ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ నాటికి ఐపీఎల్‌ నిర్వహించేందుకు దాదా ప్రయత్నాలు కొనసాగిస్తున్న వేళ ఈ కరోనా కేసులు క్రికెట్ క్రీడాకారులను, ఇటు అభిమానులకు ఇబ్బందికరంగా మారాయి.  పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 13,090 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 529 మంది మరణించారు. 

రషీద్ ఖాన్ ఇంట విషాదం.. పలువురి సంతాపం

Rashid Khan s Mother Passes Away After Prolonged Illness Fans ...

అఫ్ఘాన్ స్పిన్నర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా అతని తల్లి మరణించింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు రషీద్ ఖాన్. ‘‘అమ్మా.. నువ్వే నా సర్వస్వం. నువ్వు లేకుండా నేను లేను. ఇక నాతో ఉండవనే విషయాన్ని జీర్ణీంచుకోలేకపోతున్నా. నిన్ను చాలా మిస్సవుతానమ్మా. నీ ఆత్మకు శాంతికలగాలి’’ అంటూ రషీద్‌ ట్వీట్ చేశాడు. తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ఆమె కోసం ప్రార్థనలు చేయాలని అభిమానుల్ని రషీద్ ఖాన్ కోరాడు. రషీద్‌ తల్లి మరణవార్త తెలుసుకున్న పలువురు క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా రషీద్ ఖాన్ కి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమెకు నివాళులర్పిస్తున్నారు. 

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   an hour ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   5 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   8 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   21 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle